ఏలూరు (ప్రజా అమరావతి);
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా ల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాలరాజు కోరారు.
శనివారం కలెక్టరేట్లో తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తూర్పు ,పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం సంబంధించిన ఎన్నికలపై ఆయన సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని పార్టీల వారు కృషి చేయాలని ఆయన కోరారు .ఎన్నికలలో ఇన్వాలిడ్ ఓటింగ్ ను తగ్గించేందుకు ఓటు వేసే వారికి సరైన శిక్షణ ,ఓటింగ్ పై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో వేయవలసి ఉంటుందని ఆయన తెలిపారు .ఈ ఎన్నికలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ గాను , పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ ) ,డి ఆర్ వో లు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు.
జిల్లాలో లో 7723 మంది ఓటర్లు ఉన్నారని అందులో 4693 పురుషులు, 3030 స్త్రీలు ఉన్నారని ఆయన తెలిపారు . గతంలో 8000 మంది పైగా ఓటర్లు ఉన్నారని ఈసారి ఓటర్లు తగ్గారని ఓటర్లుగా నమోదు చేయడానికి ఈ నెల 23వ తేదీ వరకు అవకాశం ఉందని ఓటర్లుగా నమోదు చేయాలని ఆయన అన్నారు. ఈనెల 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని , ఫిబ్రవరి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని ,24వ తేదీ నామినేషన్ పరిశీలించడం జరుగుతుందని , 26వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని ఆయన తెలిపారు. మార్చి 14 వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు .జిల్లాలో 49 ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మార్చి 17 వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన అన్నారు .
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ యస్. శ్రీనివాసమూర్తి,శ్రీ బండారు కిరణ్ కుమార్ వైఎస్ఆర్సిపి నుండి , శ్రీ పాలి ప్రసాద్ టిడిపి జిల్లా కార్యదర్శి ,శ్రీ నేరుసు నెలరాజు బిజెపి నుండి , శ్రీ చింతకాయల బాబురావు సి పి ఎం ఎం జిల్లా కార్యదర్శి ,
శ్రీ రాజనాల రామ్మోహన్ రావు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుండి తదితర నాయకులు పాల్గొన్నారు .
addComments
Post a Comment