తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం డివిజన్

                కాకినాడ/అమలాపురం(prajaamaravati);

  తూర్పు గోదావరి జిల్లాలో  అమలాపురం డివిజన్ పరిధిలోని 16 మండలాల్లో ఆదివారం జరిగిన నాల్గవ, చివరి దశ  గ్రామ పంచాయితీ ఎన్నికలలో 80.29  శాతం పోలింగ్ నమోదైంది. ఈ డివిజన్ పరిధిలో ఏకగ్రీవాలు పోనూ పోలింగ్ జరుగుతున్న 262 పంచాయితీలలో మొత్తం 8,53,168 ఓటర్లు ఉండగా  6,85,049 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

మండలాల వారీగా  ఐనవల్లి  82.71,  అల్లవరం 80.23, అమలాపురం 81.01, అంబాజీపేట 81.76, ఆత్రేయపురం 85.34, ఐ.పోలవరం 82.47 , కాట్రేనికోన 74.05,  కొత్తపేట 79.89, మలికిపురం 79.23, మామిడికుదురు 81.42, ముమ్మిడివరం 83.01, పి.గన్నవరం 81.88, రావులపాలెం 78.56, రాజోలు 76.93, సఖినేటిపల్లి 75.90, ఉప్పలగుప్తం 84.00 శాతం పోలింగ్ నమోదైంది.             డివిజన్ పరిధిలో  ఆత్రేయపురం  మండలం లో అత్యధిక  పోలింగ్ శాతం నమోదు కాగా, అతి తక్కువ పోలింగ్ శాతం కాట్రేనికోన మండలంలో పోలింగ్ నమోదైంది.  

ఆదివారం జరిగిన పోలింగ్ సరళి ఈ విధంగా ఉంది¬¬ ¬- ఉదయం 8-30 గం.లకు (8.63 శాతం), ఉదయం 10-30 గం.లకు (35.89),  మద్యాహ్నం 12-30 గం.లకు (64.11), మ.2-30 గం.లకు (74.96), మద్యాహ్నం 3-30 గం.లకు పోలింగ్ ముగింపు సమయానికి (80.29) శాతం పోలింగ్ నమోదైంది. 

ఆదివారం జరిగిన పోలింగ్ ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సజాపుగా ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఉదయం 6-30 గం.లకు పోలింగ్ ప్రారంభం నుండే ఓటర్లు ఉత్సహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువ ఓటర్లతో పాటు వృద్ద ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందు తరలి రావడం అన్ని పోలింగ్ కేంద్రాలలో కనిపించింది.  అన్ని పోలింగ్ కేంద్రాలలో కోవిడ్-19 జాగ్రత్తలను పాటిస్తూ, దివ్యాంగులు, వయోవృద్దుల కొరకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 

 ఎన్నికల పరిశీలకులు, జిల్లా అధికారులు వివిధ మండలాల్లో విస్తృతంగా పర్యటించి పోలింగ్ నిర్వహణను పరిశీలించారు.  ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. బి.ఆర్.అంబేత్కర్ ఐ.పోలవరం, ముమ్మిడివరం, ఐనవిల్లి, అమలాపురం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను,  జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని  పరిశీలించారు.  జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి,  అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్  వివిధ  మండలాల్లో పర్యటించి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. అలాగే జిల్లా పోలీస్ సూపరింటెండెట్ అద్నాన్ నయీమ్ అస్మి డివిజన్లోని సనిశిత, సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించి శాంతియుత వాతారణంలో పోలింగ్ జరిగేలా బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

జిల్లా కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి, డిపిఓ ఎస్.వి.నాగేశ్వరరావు నాయక్, జడ్పి సిఈఓ ఎన్ వివి సత్యన్నారాయణ, డిఆర్డిఏ పిడి వై. హరిహరనాద్, మెప్మా పిడి  కె.శ్రీరమణి పోలింగ్ గణాంకాల సేకరణ, క్షేత్ర స్థాయి సమస్యలు, సందేహాల నివృత్తి నిర్వహించారు. 

      చాాా