ప్రణాళికా శాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
ప్రణాళికా శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ విజయ్‌కుమార్, కనెక్ట్ టూ ఆంధ్ర సీఈవో వి. కోటేశ్వరమ్మ, ఆర్టీజీఎస్ సీఈవో జె. విద్యాసాగర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరు.
అమరావతి (ప్రజా అమరావతి);
*సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ ఏమన్నారంటే...*
*నిర్ధేశిత లక్ష్యాలపై దృష్టి*
గ్రామ సచివాలయంలో కూడా డేటా క్రోడీకరణ ఒకరికి అప్పగించాలి: సీఎం
గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్‌కు ఈబాధ్యతలు అప్పగించాలి: సీఎం
మండలస్థాయిలో ఉన్న ఉద్యోగి దీన్ని సూపర్ వైజ్ చేస్తారు :సీఎం
ఆర్బీకేల్లో ఉన్న డేటాను కూడా స్వీకరించాలి:
ఆర్బీకేల పరిధిలో చేస్తున్న ఇ– క్రాపింగ్ లాంటి డేటాను కూడా పరిగణలోకి తీసుకోవాలి:
దీనివల్ల ఇ– క్రాపింగ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టగలుగుతాం:
గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు.. ఇలా గ్రామాల్లోని ప్రభుత్వ వ్యవస్థల వద్ద ఇంటర్నెట్‌సరిగ్గా పనిచేస్తుందా? లేదా? అన్న డేటా కూడా ఎప్పటికప్పుడు రావాలి:
దీనివల్ల పాలన, పనితీరు సమర్థవంతంగా ముందుకు సాగుతుంది:
సుస్థిర సమగ్రాభివృద్ధికోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయన్న అధికారులు
ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ విభాగాలు సహా ప్రపంచస్థాయి సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని సీఎం ఆదేశం
ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కోలాంటి సంస్థలతోకూడా కలిసి పనిచేయాలి: సీఎం
డేటాను కేవలం సేకరించడమే కాదు, ఆ డేటా ద్వారా మనం తీసుకోవాల్సిన చర్యలమీద కూడా దృష్టిపెట్టాలి:
వివిధ కార్యక్రమాల్లో మనం ఎంతవరకూ లక్ష్యాన్ని చేరుకున్నాం, లోపాలేమిటో గుర్తించాలి:
వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి:
*వలంటీర్లకు సత్కారం*
వలంటీర్లను ఉగాది రోజున సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్దం చేయాలి: సీఎం
వలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలి:
సేవారత్న, సేవామిత్ర...పేరుతో ఇలా మంచి సేవలను అందించిన వలంటీర్లను సత్కరించాలి:
addComments
Post a Comment