క్రమం తప్పకుండా ఎస్సీ, ఎస్టీ చట్టం అమలుపై సమీక్ష : సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.



క్రమం తప్పకుండా ఎస్సీ, ఎస్టీ చట్టం అమలుపై సమీక్ష  : సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.


*2013 నుంచి హైపవర్‌ విజిలెన్స్‌ మరియు మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు జరగలేదు : సీఎం*

*చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి గత ప్రభుత్వంలోనివారికి లేదు : సీఎం*

*ఇప్పుడు క్రమం తప్పకుండా సమావేశాలు :*

*ఒక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చర్యల ప్రగతిపై తర్వాత సమావేశంలో కచ్చితంగా సమీక్ష :*

*ఆ మేరకు అడుగులు ముందుకేస్తాం :*

*అలాగే ప్రతి మూడు నెలలకోసారి జిల్లాస్థాయిలో కమిటీల సమావేశాలు :*

*జిల్లాస్థాయి సమావేశాల నివేదికలు, తీసుకున్న చర్యలపై సమీక్ష :*

*ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసుల్లో హత్యకు గురైన కుటుంబాలకే కాకుండా అత్యాచారానికి గురైన వారి కుటుంబాలకూ ఉద్యోగాలు : సీఎం*

*ఎస్సీ, ఎస్టీ చట్టం కింద సొంత అధికారులపైనా పోలీసు శాఖ కేసులుపెట్టి చర్యలు తీసుకుంది :*

*చట్టం అమలుతీరుపై చిత్తశుద్ధికి ఇది నిదర్శనం :*

*వారానికి ఒకసారి కలెక్టర్లతో కలిసి  జిల్లా ఎస్పీలు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోకి వెళ్లాలి :*

*దీనివల్ల అణగారిన వర్గాలు పోలీసులకు దగ్గర అవుతాయి :*

*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ స్పష్టీకరణ*. 


*వివిధ కేసుల్లో బాధితులకు రూ.10లక్షల పరిహారం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే :*

*షెడ్యూలు కులాల నేషనల్‌ కమిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సునీల్‌కుమార్‌ బాబు* 



అమరావతి (ప్రజా అమరావతి):


*సచివాలయంలో ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం అమలుపై స్టేట్‌ లెవల్‌ హైపవర్‌ విజిలెన్స్‌ మరియు మానిటరింగ్‌ కమిటీ సమావేశం*


*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన సమావేశం*

*రాష్ట్రంలో చట్టం అమలుతీరును సమగ్రంగా సమీక్షించిన కమిటీ*


*సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..:* 


2013 తర్వాత ఇప్పటివరకూ ఈ కమిటీ సమావేశం జరగలేదు: సీఎం

చట్టం అమలుపై వారిలో ఎవ్వరికీ కూడా ప్రత్యేక దృష్టిలేదు : సీఎం

ఉన్నత స్థాయిలో దృష్టిలేకపోవడం శోచనీయం: సీఎం

జరిగిందేదో జరిగిపోయింది.. ఇప్పుడు మనం ప్రత్యేక దృష్టిపెడుతున్నాం:

మనం ప్రతిఏటా ఈ సమావేశాన్ని నిర్వహిస్తాం:

చట్టం అమలు తీరుపై ప్రగతిని మనం సమీక్షించుకుంటాం:

గతంలో తీసుకున్న చర్యలు, ఇప్పుడు మెరుగుపరుచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవడమే లక్ష్యంగా ముందడుగులు వేస్తాం:


ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలీసు శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది: సీఎం

తప్పు చేసినవారు తమవారైనా సరే.. సంబంధిత పోలీసు అధికారులపై ఆ శాఖ చర్య తీసుకుంది:

హోంమంత్రి, డీజీపీ ఎంతో సాహసంగా వ్యవహరించి వారిపై చర్యలు తీసుకున్నారు: సీఎం

నియమ, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు:

చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించారు:

చట్టం ముందు అందరూ సమానులే అన్నట్టుగా వ్యవహరించారు:

ఎస్సైలు, సీఐలపై యాక్షన్‌ తీసుకున్నారు :


వేదింపులకు గురైన కేసుల్లో బాధితులకు ఆర్థిక సహాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నామని, ఇది కొనసాగుతుందన్న సీఎం


ఎస్సీ, ఎస్టీ కేసుల్లో అత్యాచారం, హత్యకు గురికాబడ్డ కుటుంబాల్లోని వ్యక్తులకు ఉద్యోగాలను కల్పించాలని సీఎం ఆదేశం

ఇందులో ఎలాంటి జాప్యం జరగకూడదని సీఎం ఆదేశం

అందుబాటులో భూమి ఉంటే ఇద్దామని లేని పక్షంలో సేకరించి బాధితులకు పంపిణీచేద్దామన్న సీఎం


జిల్లా స్థాయిలో హైపవర్‌ విజిలెన్స్‌ మరియు మానిటరింగ్‌ కమిటీల సమావేశం జరగాలి: సీఎం

ఇన్‌ఛార్జి మంత్రులు ప్రతి మూడు నెలలకోసారి జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం అమలు తీరుపై సమీక్ష చేయాలి: సీఎం

ఇందులో కలెక్టర్‌ సహా ఉన్నతాధికారులు పాల్గొనాలి: సీఎం

దీనిపై ఉత్తర్వులు జారీచేయాలని సీఎం ఆదేశం

దీనిపై ఎస్‌ఓపీలను తయారుచేసి ఇవ్వాలని ఆదేశం:

చట్టం అమలుపై వారికి ఎస్‌ఓపీ ఇవ్వాలన్న సీఎం

అమలు తీరుపై నివేదిక పంపాలన్న సీఎం

జిల్లాల నుంచి వచ్చిన నివేదికలపై రాష్ట్రస్థాయి కమిటీ దృష్టిసారిస్తుందన్న సీఎం

జిల్లాలనుంచి ఇలా వచ్చిన నివేదికలపై సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం


ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తు ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఐడీలోని ఎస్సీ, ఎస్టీయాక్ట్‌ కేసుల దర్యాప్తు వింగ్‌కు సీఎం ఆదేశం

దర్యాప్తునకు సంబంధించి ఎస్‌ఓపీని పంపాలి:

దర్యాప్తులో ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలి:


లోటుపాట్లను మూడు నెలల్లో సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి:

అణగారిన వర్గాలకు పోలీసులు దగ్గరి కావాలి: సీఎం

ఇప్పటికే గ్రామ సచివాలయాలను వారంలో ఒకసారి కలెక్టర్లు సందర్శించాలని తప్పనిసరి చేశాం: సీఎం

వారానికి ఒకసారి కలెక్టర్లతో కలిసి జిల్లా ఎస్పీలు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోకి వెళ్లాలి: సీఎం

దీనివల్ల పోలీసులు అణగారిన వర్గాలకు దగ్గర అవుతారు : సీఎం

ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కలెక్టర్లు, ఎస్పీల మొదటి కాన్ఫరెన్స్‌లోనే అణగారిన వర్గాలు, మహిళలకు అండగా ఉండాలని చెప్పాను : సీఎం


ఎస్సీ, ఎస్టీ చట్టం అమలుకు సంబంధించి కమిటీలో ఉన్న సభ్యులు తమ సలహాలు, సూచనలను పోలీసు అధికారులకు, అధికారులకు అందించాలన్న సీఎం 

ఈ సలహాలు సూచనలపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు మేథోమథనం చేయాలని సీఎం ఆదేశం

తదుపరి దీనిపై కార్యాచరణకు దిగాలని సీఎం ఆదేశం

అధికారులతో కమిటీ సభ్యులు సమావేశమై... వీటిపై మరోసారి చర్చించాలన్న సీఎం

ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా, ప్రత్యేకంగా న్యాయవాదుల నియామకంపైనా, అలాగే బాధితులకు అందాల్సిన సహాయంపైనా దృష్టిపెట్టాలి: సీఎం


అణగారిన వర్గాలకు మంచి జరగాలి, సాధికారిత రావాలన్న దిశగానే తొలిసారిగా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం:

రాష్ట్ర హోంమంత్రి పదవి దళిత మహిళకు ఇచ్చాం:

అలాగే విద్యాశాఖనుకూడా దళితులకే ఇచ్చాం: 

డీజీపీగారు కూడా ఎస్టీ వర్గానికి చెందినవారు :

అణగారిన వర్గాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే, వారికి కంఫర్ట్‌ ఇవ్వడానికే ఈ నిర్ణయాలు:

విద్యాశాఖలో కూడా అన్ని విషయాలు తెలిసిన మనిషి ఉండాలని సురేష్‌ను మంత్రిగా పెట్టాం:

వీరితో వ్యవస్థలో మార్పులు తీసుకు వస్తున్నాం, తద్వారా అణగారిన వర్గాల్లో సాధికారితకోసం ప్రయత్నం చేస్తున్నాం:

ఒక దిశగా మనం అడుగులు వేయడం  మొదలుపెట్టాం, రోజు రోజుకూ కూడా మన లక్ష్యసాధనలో ప్రగతి కనిపిస్తోంది:


*ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం అమలుపై ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశంసించిన కమిటీ సభ్యులు.*

 

వివిధ కేసుల్లో బాధితులకు రూ.10లక్షల పరిహారం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఒక్క ఏపీయేనని ప్రశంసించిన షెడ్యూలు కులాల నేషనల్‌ కమిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సునీల్‌కుమార్‌ బాబు.


తూర్పుగోదావరి (రాజమండ్రి), ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన ఘటనల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎస్సీ, ఎస్టీ చట్టం అమలులో చిత్తశుద్ధిని చూపించిందని ప్రశంసించిన కమిటీ సభ్యులు


ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా సీఎంగారు తక్షణమే స్పందిస్తున్నారని సమావేశంలో ప్రస్తావించిన సభ్యులు

దాదాపు ఏడు ఘటనల్లో ఆయా కుటుంబాలను ఉదారంగా ఆదుకున్నారని ప్రశంసించిన సభ్యులు

ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో జరిగిన ఘటనల్లో రూ.60లక్షలు బాధితులకు ఆర్థిక సహాయం చేశారన్న అధికారులు

బాధితుల వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక సహాయ అంశాన్ని ఎక్కడా వార్తల్లో కనిపించనీయకుండా సున్నితంగా వ్యహరిస్తున్న అంశాన్ని సమావేశంలో ప్రస్తావించిన కమిటీ.

Comments