అమరావతి (ప్రజా అమరావతి);
"వర్క్ ఫ్రమ్ హోమ్" విధానంలో ఏపీ టాప్ గా నిలవడం ఖాయం: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
యువత గర్వంగా చెప్పుకునే ఉద్యోగాల కల్పనే లక్ష్యం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
ఎక్కువ ఉద్యోగలందించేందుకు అవకాశం ఉన్న ఏకైక శాఖ ఐ.టీ శాఖ.
విశాఖపట్నంలోని మిలీనియం టవర్ సమీపంలో ఐ.టీ పార్కు ఏర్పాటుకు అధ్యయనం చేయాలని మంత్రి మేకపాటి ఆదేశం.
తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్ లోని రహేజా మైండ్ స్పేస్ తరహాలో ఐ.టీ పార్క్ ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం.
ఐ.టీ శాఖ నుంచి ముఖ్యమంత్రి కోరుకుంటోంది బీపీవో ఉద్యోగాలు కాదు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలకే ప్రాధాన్యత.
ఐ.టీ పార్కు అభివృద్ధితో వీలైనన్ని ఎక్కువ నాణ్యమైన ఉద్యోగాలందించాలి.
ఐ.టీ కార్యాలయాల విస్తీర్ణంపై లోతైన ఉదాహరణలిచ్చిన మంత్రి మేకపాటి.
ఓ సంస్థ 8వేల ఉద్యోగాలు అందించేందుకు ముందుకు వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావన.
రాబోయే రోజుల్లో ఐ.టీపై మరింత ఎక్కువ శ్రద్ధ పెడతా.
ఆర్థిక ఇబ్బందులున్నా అనుకుంటే అనువైన అవకాశాలుగా మలుచుకోవచ్చు.
ప్రభుత్వానికి అన్ని శాఖలలో వివిధ రకాలుగా సేవలందించే డిపార్ట్ మెంట్ ఐ.టీ శాఖ మాత్రమే.
అపీట, ఏపీటీఎస్, ఏపీఐఎస్, ఏపీఐటీఏ,ఏపీ శాక్, ఈ-ప్రగతి విభాగాలపైనా సమీక్ష.
ఐ.టీ శాఖ చేపట్టే ఈ-ప్రొక్యుర్ మెంట్, కన్సల్టెన్సీ సేవలు, ఈ-వేస్ట్ మేనేజ్ మెంట్, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, వీడియో కాన్ఫరెన్స్, బ్యాండ్ విడ్త్ సర్వీసుల గురించి మంత్రికి వివరించిన ఏపీటీఎస్ ఎండీ.
పరిపాలన అనుమతుల జాప్యంపై శ్రద్ధ వహించి..వేగంగా పరిష్కరించాలి.
ఐ.టీ శాఖకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ అప్ డేట్ గా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి మేకపాటి.
కనీసం దృష్టి పెట్టకపోవడంపై మండిపాటు.
48 గంటల్లో వెబ్ సైట్ ప్రక్షాళన చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం.
ఐ.టీ శాఖ అయ్యిండి ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించిన మంత్రి మేకపాటి.
అర్హత, సామర్థ్యం కలిగిన వారికి బాధ్యతలు అప్పగించి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉండాలని ఆదేశం.
ఐ.టీ శాఖ ముఖ్య భూమిక పోషించే ప్రభుత్వ కార్యక్రమాలైన అమ్మఒడి, రైతు బంధు, నవరత్నాలు సహా పలు ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై మంత్రి ఆరా.
స్టార్ట్ అప్ , ఈ-గవర్నెన్స్ పాలసీలపై చర్చ.
ఐ.టీ శాఖ ఆధ్వర్యంలోని కీలక ప్రాజెక్టుల పురోగతి గురించి మంత్రి ఆరా.
ఐ.టీ శాఖ బడ్జెట్, చెల్లింపులు, ప్రోత్సాహకాలు, పూర్తి చేసిన పనులు, చేయాల్సిన ప్రాజెక్టులు, సిబ్బంది సహా అన్ని విషయాలపై చర్చించి అధికారులకు తగు సూచనలిచ్చిన మంత్రి మేకపాటి.
ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖ స్వయం ప్రతిపత్తి వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అధికారులకు మంత్రి మేకపాటి ఆదేశం.
మిలీనియం టవర్లు, సిగ్నేచర్ టవర్లు, ఐ.టీ కాన్సెప్ట్ సిటీ అంశాలపై మంత్రికి వివరించిన ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ ప్రజంటేషన్.
మిలీనియం టవర్ నిర్మాణ దశ, ఐ.టీ కాన్సెప్ట్ సిటీల భూసేకరణలపైన చర్చ.
ఏపీటీఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న మౌలికాభివృద్ధి పనులపైనా చర్చ.
విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో మంత్రి మేకపాటి అధ్యక్షతన ఐ.టీ శాఖపై సమీక్ష.
ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష.
హాజరైన ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి జీ.జయలక్ష్మి, ప్రత్యేక కార్యదర్శి బి. సుందర్, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, ప్రత్యేక ప్రతినిధి హరిప్రసాద్ రెడ్డి లింగాల,ఐ.టీ డైరెక్టర్ కమ్యునికేషన్స్ వేంకటాచలం, జాయింట్ సెక్రటరీ నాగరాజ, ఏపీఐఐసీ ఎండీ రవీన్ కుమార్ రెడ్డి,ఇతర అధికారులు.
addComments
Post a Comment