శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి); నందు శ్రీ శార్వరీ నామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి ది: 16-02-2021 శ్రీ పంచమి సందర్భముగా ప్రధాన ఆలయంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారు   మరియు మహా మండపం ఆరో అంతస్తులో ఏర్పాటుచేసిన ప్రధాన ఉత్సవ మూర్తికి సరస్వతి దేవిగా అలంకరించుట జరిగినది.  శ్రీ పంచమి సందర్భంగా ఈరోజు ఉదయం గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనరు శ్రీ అర్జున రావు, IAS గారు  ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి  శ్రీ MV సురేష్ బాబు గారు  స్వాగతం పలికారు.


శ్రీ పంచమి సందర్భంగా యాగశాల నందు సరస్వతీ యాగము మరియు మహా మండపం ఆరవ అంతస్తు నందు  ఏర్పాటుచేసిన సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద గణపతి పూజ, సరస్వతి పూజ  మరియు వేదపండితులచే సరస్వతి మంత్ర హవనము నిర్వర్తించుట జరిగినది.  ఈ కార్యక్రమము నందు గౌరవనీయులైన దేవదాయ శాఖ కమీషనరు గారు మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి వారు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం దేవాదాయశాఖ కమీషనరు శ్రీ పి. అర్జున రావు,IAS గారి చేతులమీదుగా విద్యార్థినీ విద్యార్థులకు ఒక కలము, శ్రీ అమ్మవారి(పాకెట్ సైజు) ఫోటో, శ్రీ అమ్మవారి రక్షాకంకణం, కుంకుమ ప్రసాదం, ఉచిత ప్రసాదంగా పంపిణీ చేయడం జరిగినది.

శ్రీ పంచమి సందర్భంగా  దేవస్థానం నందు పాఠశాల మరియు కళాశాల విద్యార్ధినీ, విద్యార్ధులకు ఉచిత దర్శనము  ఉ|| 7:00 గం.ల నుండి సా|| గం. 5:00 ల వరకు ఏర్పాటు చేయడమైనది.  శ్రీ అమ్మవారి దర్శనమునకు వచ్చిన విద్యార్ధినీ, విద్యార్ధులకు కనకదుర్గానగర్ నుండి అర్జున వీధి గుండా మహామండపం నందు ఉచిత క్యూలైన్లు ద్వారా ముఖ మండపం దర్శనం ఏర్పాటు చేయటమైనది. మరియు ఉచిత దర్శనం అనంతరం విద్యార్ధిని, విద్యార్ధులకు ఒక కలము, శ్రీ అమ్మవారి(పాకెట్ సైజు) ఫోటో, శ్రీ అమ్మవారి రక్షాకంకణం, కుంకుమ, లడ్డు ప్రసాదం ఇవ్వడం జరిగినది. శ్రీ పంచమి సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు వేల సంఖ్యలో తరలివచ్చి సరస్వతీదేవి రూపంలో దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. శ్రీ పంచమి సందర్భంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో విచ్చేయునుండటంతో ఆలయ అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేయడమైనది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం వారు చేసిన ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి శ్రీ MV సురేష్ బాబు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.