కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదార్ పురం హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన చాలా దురదృష్టకరం,కర్నూలు (ప్రజా అమరావతి), ఫిబ్రవరి 14:-


కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదార్ పురం హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరమని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ వివరించారు. ఆదివారం తెల్లవారుజామున 3-30 గంటలకు మదనపల్లి నుండి టెంపో ట్రావెలర్ లో అజ్మీర్ యాత్రకు/దైవ దర్శనానికి వెళుతున్న రెండు కుటుంబాల సభ్యులు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే  జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జిల్లా ఎస్పీ ఫక్కీరప్పలు ప్రమాద సంఘటనా స్థలికి చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును, వెల్దుర్తి, డోన్ ఎస్.ఐలు, సి ఐ లు , డిఎస్పీ,  పోలీసు అధికారులు, డిటీసీ అధికారులు, స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా విలేకరులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెల్దుర్తి మండలం మాదార్ పురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరమన్నారు. 


పోలీసు అధికారులు, డిటీసీ చందర్ ప్రాథమిక విచారణ ప్రకారం టెంపో ట్రావెలర్ అధిక వేగం, డ్రైవర్  నిద్రమత్తులో బెంగళూరు వైపు నుండి హైదరాబాద్ మీదుగా అజ్మీర్ వెళుతూ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదార్ పురం వద్ద జాతీయ హైవే 44 పై డివైడర్ ను ఢీకుని వరంగల్ నుండి తాడిపత్రి వైపు వెళుతున్న లారీని ఢీకొనగా 14 మంది స్పాట్ లో మృతి చెందడం  అత్యంత విచారకరమని కలెక్టర్  వివరించారు. ప్రమాదం జరిగిన సంఘటన తీరును లోతుగా విశ్లేషించి వివరాలను సేకరిస్తామన్నారు. ప్రమాదకర సంఘటనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గాయపడిన కుటుంబాలను ఆదుకుంటామని కలెక్టర్ వివరించారు. 14 మంది మృతులు (8 మంది మహిళలు, 5మంది పురుషులు, చిన్న బాలుడు) చిత్తూరు, కడప జిల్లా వాసుల మృతదేహాలను కర్నూలు జిజిహెచ్ మార్చురీ కి  తరలించి పోస్టుమార్టం నిర్వహించడం జరుగుతుందన్నారు.


అనంతరం జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జిల్లా ఎస్పీ ఫక్కీరప్పలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో

తీవ్రంగా గాయపడిన 4 గురు క్షతగాత్రులను పరామర్శించి అన్ని రకాల మెరుగైన వైద్య సహాయం అందించాలని కర్నూలు జిజిహెచ్ సూపరింటెండెంట్ నరేంద్రనాథ్ రెడ్డి, డ్యూటీలో వున్న డాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు.


ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల పేర్లు, వయసు ఇతర వివరాలు.


1) Shaik Dastagiri, 50 yrs, s/o late Imam Saheb, Balaji Nagar, Madanapalli,

 

2) Shaik Ammaa Zan, 35 yrs (w/o Dastagiri), Balaji Nagar, Madanapalli,


3) Shaik Shamirin, 16 yrs, D/o Dastagiri, Balaji Nagar, Madanapalli


4) Shaik Amarin, 15 yrs, D/o Dastagiri Balaji Nagar, Madhanapalli


5) Shaik Rafi, 36 yrs, s/o late Imam Saheb, Balaji Nagar, Madanapalli


6) Shaik Masthani, 32 yrs, w/o Rafi Balaji Nagar, Madanapalli


7) Shaik Jafer Vali, 30 yrs, s/o Imam Saheb, Balaji Nagar, Madanapalli


8) Shaik Roshini, 29 yrs, w/o Jafer Vali, Balaji Nagar, Madanapalli


9) Shaik Nowjira Bi, 65 yrs, w/o late Imam Saheb, Balaji Nagar, Madanapalli


10) Shaik Mohammed Rihan, 1 yr, s/o Rafi, Balaji Nagar, Madanapalli

 

11) Shaik Nowjiya, 34 yrs, D/o Imam Saheb, Balaji Nagar, Madanapalli


12) Shain Ameer Jan, 63 years, W/o Shaik Sirajuddin, P&T Colony, Madanapalli


13) Nazeer, 55 yrs, s/o Mahaboob Khan, Eswaramma Colony, Madanapalli town (Driver cum Owner)


14) Shaik Shafi, 38 yrs, s/o Jafer vali, Jagan Colony, Madanapalli Town (Driver).


Injured persons :-

-------------------------

1) Shaik Khasif, 14 yrs, s/o Dastagiri, Balaji Nagar, Madanapalli


2) Shaik Yasmin, 5 yrs, D/o Rafi, Balaji Nagar, Madanapalli


3) Shaik Asma, 8 yrs, D/o Jafer Vali, Balaji Nagar, Madanapalli


4) Shaik Musa Asin, 4 yrs, s/o Jafer vali,  Balaji Nagar, Madanapall.