విశాఖపట్నం, ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ) పరిధిలో ప్రాజెక్టులపై సీఎం సమీక్ష.విశాఖపట్నం, ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ) పరిధిలో ప్రాజెక్టులపై సీఎం సమీక్ష.*పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి, ఏఎంఆర్‌డీఏ కమీషనర్‌ పి. లక్ష్మీ నరసింహం, ఇతర ఉన్నతాధికారులు హాజరు*అమరావతి (ప్రజా అమరావతి): కీలక ప్రాజెక్టులపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.


విశాఖపట్నంలోని సముద్రతీరంలో 13.59 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు ప్రతిపాదనలపై సీఎం సమీక్ష

ఇదే భూమిని లులూ గ్రూపునకు కారుచౌకగా 33 ఏళ్ళ లీజ్‌కు కట్టబెట్టిన గత ప్రభుత్వం

ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా, విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రతిపాదనలపై సీఎం సమీక్ష

సీఎంకు వివరాలు అందించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీ, ఏపీఐఐసీ 

కమర్షియల్‌ ప్లాజా, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాల వల్ల కనీసం ప్రభుత్వానికి సుమారు రూ.1450 కోట్ల నికర ఆదాయం వస్తుందన్న ఎన్‌బీసీసీ 


*అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష*


కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించే ప్రతిపాదనపై వివరాలు అందించిన అధికారులు

ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా

ఈ రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం

అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందన్న సీఎం

ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న రోడ్లనుకూడా అభివృద్ధిచేయాలన్న సీఎం

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును మెయిన్‌ రోడ్డుకు అనుసంధానం చేసే పనులుకూడా పూర్తిచేయాలన్న సీఎం

హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం

అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను కూడా పూర్తిచేయాలని సీఎం ఆదేశం.