తెలుగు రాష్ట్రాల్లో మనగుడి – ఏప్రిల్ 13న ఉగాది, ఏప్రిల్ 21న శ్రీరామనవమి.
తిరుమల (PRAJa అమరావతి) :టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా...
ఏప్రిల్ 13న ఉగాది,
ఏప్రిల్ 21న శ్రీరామనవమి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో గల రామాలయాల్లో నిర్వహించనున్నారు.
ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం వినిపించడంతోపాటు ఉగాది పచ్చడి, ఉగాది విశిష్టత తెలిపే పుస్తకాలను భక్తులకు పంపిణీ చేస్తారు.
ఏప్రిల్ 21న శ్రీరామనవమి సందర్భంగా రామాలయాల్లో ఏడు రోజుల పాటు ప్రముఖ పండితులు రామాయణంలోని వివిధ అంశాలపై ధార్మికోపన్యాసాలు చేస్తారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
addComments
Post a Comment