కెఎల్ విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రారంభమైన సమ్యక్ 2021.

 కెఎల్ విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రారంభమైన సమ్యక్ 2021.


తాడేపల్లి (ప్రజా అమరావతి);

కెఎల్ విశ్వవిద్యాలయంలో త్వరలో మూడు అధునాతన ల్యాబ్ లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ....... చల్లా మధుసూదన్ రెడ్డి.


కె.ఎల్.విశ్వవిద్యాలయంలో 11వ జాతీయ స్థాయి టెక్నో ఫెస్ట్ సమ్యక్-2021 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంద్రప్రదేశ్ రాష్ట నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులో సృజనాత్మకత పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. తాను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కావడం వల్ల భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా సాధించిన తాజా సాంకేతిక పురోగతిపై నాకు స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు. కెఎల్ విశ్వవిద్యాలయం విద్యార్థుల నుండి ఉత్తమమైన నైపుణ్యాలను తీసుకురావడంలో మంచి పాత్రగా ప్రశంసించబడిందని అన్నారు. విద్యార్థులను మంచి ఉద్యోగులుగా తీర్చిద్దేందుకు రాష్ట్రంలోని నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా అధునాతన టెక్నాలజీలను ఉపయోగించే పైథాన్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి వాటిపై విద్యార్థులకు సహకారం అందిస్తామని వెల్లడించారు. త్వరలో ఆంద్రప్రదేశ్ లో ప్రపంచ స్థాయి నైపుణ్యం గల విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 30 నైపుణ్య అభివృద్ధి కళాశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమను ఆదేశించారని తెలిపారు. వచ్చే 2 సంవత్సరాలో రాష్ర్టంలో ప్రపంచ స్థాయి నైపుణ్య అభివృద్ధి కార్పోరేషన్ ద్వారా విద్యార్థులకు ఎంతో సహాయం అందిస్తామని అన్నారు. **ఆంద్రప్రదేశ్ రాష్ట నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా కెఎల్ విశ్వవిద్యాలయంలో త్వరలో అప్లైడ్ రోబోటిక్ కంట్రోల్ లాబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాబ్, రెడ్ పైన్ సిగ్నల్స్ లాబ్ లాంటి మూడు సెంటర్స్ ను ఏర్పాటు** చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు మంచి ఉద్యోగాల కోసం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఎల్.ఎస్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ, విశ్వవిద్యాలయంలో గత 11 సంవత్సరాలుగా సమ్యక్ నిర్వహిస్తున్నామని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సమ్యక్ ఫెస్ట్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్దతుల్లో నిర్వహిస్తున్నమని అన్నారు. దేశ వ్యాప్తంగా 20వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఆన్ లైన్ మోడ్ లో 100కి పైగా ఈవెంట్లు నిర్వహిస్తున్నామని, ఆఫ్ లైన్ లో 200కు పైగా టెక్నికల్, నాన్-టెక్నికల్ ఈవెంట్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు విలువైన నగదు బహుమతులను అందచేస్తామన్నారు. కోవిడ్ సమయంలో సమ్యక్ నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సాదించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు మెంబర్ ఎపీఆర్ఈఆర్ఏ- ఎక్స్ ఐఎస్ఆర్ఓ (ఇస్రో చైర్మన్) చందు సాంబశివరావు, ఆంద్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు అఫైర్స్ సర్వీసెస్ సలహాదారు మేడాపటి వెంకట్, గ్లోబల్ టెక్నాలజీ సీఈఓ, ఫౌండర్ తరుణ్ కాకని, విశ్వవిద్యాలయ రెజిస్ట్రార్ డాక్టర్ వై.వి.ఎస్.ఎస్.ఎస్.వి.ప్రసాదరావు, సమ్యక్ చైర్మన్ డాక్టర్ జయ కుమార్ సింగ్, సమ్యక్ కన్వీనర్ డాక్టర్ హనుమంతరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.