మదనపల్లి మునిసి పాలిటీ పరిధిలో జరుగు తున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్.
*కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ను ధరించండి:జిల్లా కలెక్టర్*
మదనపల్లి (ప్రజా అమరావతి), మార్చి10:మదనపల్లి మునిసి పాలిటీ పరిధిలో జరుగు తున్న పోలింగ్ ప్రక్రియను బుధ వారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ ఎం.హరి నారాయణన్ పరిశీలిం చారు.*
*మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉర్దూ హైస్కూల్ మరియు నీరుగట్టు వారి పల్లి మాయా బజార్ వీధి లో గల వివేకానంద మునిసిపల్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని, ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ శాతం ను పరిశీలించారు.*
*ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కు ను ధరిం చాలని,కోవిడ్ నేప థ్యంలో భౌతిక జీవితం పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని ఓటర్ల కు సూచించారు.* .
*అనంతరం జిల్లా పరి షత్ హైస్కూల్ లో ఏర్పా టు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి స్ట్రాంగ్ రూమ్_ భద్రతా ఏర్పాట్లు లోభాగంగా సీసీ కెమెరా లు, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్ల ను పరిశీలిస్తూ పోలింగ్ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ కు తరలించాలని మునిసి పల్ కమిషనర్ రవి ని ఆదేశిం చారు..*
*జిల్లా కలెక్టర్ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ (అభి వృద్ధి)వి. వీరబ్రహ్మం, మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి,మదనపల్లి డిఎస్పి రవి మనోహరా చారి, పుంగనూరు మున్సిపల్ కమిషనర్ వర్మ తదితరులు కలరు..
addComments
Post a Comment