శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం అదృష్టం

 


శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం అదృష్టం


.


 దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం.


 ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా స్వశక్తితో కోవిడ్ వ్యాక్సిన్ ను  తయారు చేశాం.


 150 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ను సరఫరా చేసే సామర్థ్యం కలదు..అందు లో భాగంగా 75 దేశాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేస్తున్నాము.


 కోవిడ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటిం చాలి.


 తిరుపతి రైల్వే స్టేషన్ లో విస్తరణ పనులు ముమ్మరంగా సాగు తున్నాయి:కేంద్ర రైల్వే శాఖ మంత్రి.


 తిరుమల మార్చి 13 (ప్రజా అమరావతి):


 తిరుమల  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం అదృష్టము గా భావిస్తున్నానని గౌ. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు..


 శనివారం ఉదయం గౌ. కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌ.రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు..


 అనంతరం దేవస్థానం వెలుపల మీడియాతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి మాట్లా డుతూ వెంకటేశ్వర స్వామి వారు తన ఆశీర్వాదం తీసుకోవడానికి నాకు మరొకసారి అవకాశాన్ని  కల్పించారని.. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం అదృష్టము గా భావిస్తున్నానని తెలిపారు..  130 కోట్ల మంది భారతీ యులను కోవిడ్ నుండి కాపాడుటకు దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పోరాడారని తెలిపారు.. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా మన దేశం ఎవరి మీద ఆధారపడకుండా   స్వశక్తితో కోవిడ్ వ్యాక్సిన్ ను  తయారు చేశామని, 150 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ను సరఫరా చేసే సామర్థ్యం కలదని..అందు లో భాగంగా 75 దేశాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు..


 ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ ద్వారా వస్తువుల రవాణా అత్యధిక శాతం చేయడం జరిగిందని ,కోవిడ్ నిబంధనలను సవరించడం వల్ల ప్రయాణికుల సంఖ్య 80 శాతం పెరిగిందని తెలి పారు.అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవసర మైన అన్ని మెరుగైన వస తుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని, తిరు పతి రైల్వే స్టేషన్ లో విస్తరణ పనులు ముమ్మరంగా సాగు తున్నాయని తద్వారా ఎక్కువ రైళ్ల రాక పోకలకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు..


గౌ. కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెంట గౌ. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గౌ. టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, గౌ.టిటిడి ఈవో  జవహర్ రెడ్డి,గౌ.అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు కలరు.


--------------///------------

డిడి, ఐ&పీఆర్,చిత్తూరు

Comments