ప్రశాంతంగా మునిసిపల్ కౌంటింగ్ నిర్వ హణ.

 ప్రశాంతంగా మునిసిపల్ కౌంటింగ్  నిర్వ హణ.


 గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే సజావుగా మునిసిపల్ ఎన్నికల నిర్వహణ. 


 స్వేచ్ఛాయుత వాతావర ణం లో ప్రజలు తమఓటు హక్కు ను వినియోగించు కొన్నారు.


 ఈ నెల 18 న చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లకు మేయర్,డిప్యూటీ మేయ ర్, 4 మునిసిపాలిటీ లలో చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక.


 సమర్థవంతంగా ముని సిపల్ కౌంటింగ్ నిర్వహణ జరిపిన అధికారులకు అభినంద నలు.


 మున్సిపల్ ఎన్నికల నిర్వహణ లో భాగస్వా ములైన మున్సిపల్ కమి షనర్లు,పోలీసు, మీడియా భాగస్వాములైన అయిన ప్రతి ఒక్కరికి అభినంద నలు : జిల్లా కలెక్టర్


 చిత్తూరు (ప్రజా అమరావతి),మార్చి14: జిల్లాలో రెండు కార్పొరేషన్లు అయిన చిత్తూరు, తిరుపతి మరియు నాలుగు మున్సి పాలిటీలు అయినా మదనపల్లి, పలమనేరు, నగరి, పుత్తూరు మున్సిపాలిటీలో కౌంటింగ్  నిర్వహణ ప్రశాంత వాతా వరణంలో జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా ఎన్నికల అథారిటీ ఎం. హరి నారాయణన్ తెలిపారు..


 ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు నగరపాలక సంస్థ కు సంబంధించి స్థానిక పి వి కే ఎన్ ప్రభుత్వ డిగ్రీ  కాలేజీ లో జరుగుతున్న కౌంటింగ్ నిర్వహణను జిల్లా కలెక్టర్ పరిశీలించారు..


 అనంతరం జిల్లా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్  ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ప్రశాంత వాతావరణం లో  చేయడం జరిగిందని తెలిపారు..ఈ నెల 18 న చిత్తూరు, తిరు పతి కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్,4 మునిసి పాలిటీ లలో చైర్మ న్, వైస్ చైర్మన్ ల ఎన్నిక జరుగుతుందని తెలిపారు..


ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులకు వారి సిబ్బంది కి, టీచర్లు, ఇతర అధికారులందరికి,మీడియా వారికి  అభినందనలు తెలిపారు ..


Comments