అమరావతి (ప్రజా అమరావతి);
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష...
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం...
కరోనా వ్యాక్సినేషన్ వేగ వంతం, డాక్టర్స్ పోస్టులు భర్తీ,
పారా మెడికల్ సిబ్బంది నియామకం అంశాలపై సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం సమీక్షా సమావేశం..
పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ , ప్రిన్సిపల్ సెక్రటరీ( కొవిడ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర , ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఈవో డాక్టర్ మల్లికార్జున, ప్రజా ఆరోగ్య శాఖ సంచాలకురాలు డాక్టర్ గీతా ప్రసాదిని , ఎపివివిపి కమీషనర్ డాక్టర్ రామకృష్ణ, డిఎంఇ డాక్టర్ రాఘవేంద్ర రావు...
రాష్ట్రములో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగం పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం...
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు జరగాలి...
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు సంఖ్య పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం...
వ్యాక్సినేషన్ ఉదృతంగా చేపట్టడానికి గ్రామ సచివాలయాలు యూనిట్ గా తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అదేశాలు ఇచ్చారు...
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న వారికి సత్వరమే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి...
45సంవత్సరాల పైబడి, ధీర్గకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికీ వ్యాక్సిన్ వెంటనే చేయడానికి ఏర్పాట్లు చేయాలి...
వ్యాక్సినేషన్ పై సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని అధికారులకు మంత్రి ఆళ్ల నాని అదేశం...
పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం RTPCR పరీక్షలు జరగడానికి అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని అధికారులకు అదేశం...
కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించడం కన్నా.. ఆ వైరస్ నివారణకు ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి.....
రాష్ట్రములో ఈ నెల 18వ తేది వరకు 13లక్షల 80వేల 537మంది వ్యాక్సిన్ తీసుకున్నారన్న మంత్రి ఆళ్ల నాని..
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు హెల్త్ కేర్ వర్కర్స్ కి మొదటి డోస్ 3లక్షల 22వేల 102మందికి,
రెండోవ డోస్ ఒక లక్ష 88వేల 407మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది...
ఫ్రంట్ లైన్ వర్కర్స్ మొదటి డోస్ 3లక్షల 40వేల 620మందికి, రెండొవ డోస్ 68వేల 345మందివ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది..
60సంవత్సరాల వయసు కలిగిన వారు 2లక్షల 81వేల 187మంది,
45సంవత్సరాలనుండి 59సంవత్సరాల వరకు 98వేల 550మంది వ్యాక్సిన్ తీసుకున్నట్టు తెలిపిన మంత్రి ఆళ్ల నాని..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న వైద్యులు పోస్టులు భర్తీపై ద్రుష్టి పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులకు మంత్రి ఆళ్ల నాని అదేశం...
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నెట్ వర్క్ హాస్పిటల్స్ లో ఆరోగ్య శ్రీ మరింత అమలు జరగడానికి ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టండి...
addComments
Post a Comment