చంద్రబాబు, స్టేలు బాబు అన్నా చంద్రబాబే

 గుడివాడ, కృష్ణాజిల్లా, మార్చి 20 (ప్రజా అమరావతి);



     రాష్ట్ర పౌర సరఫరాలు,  వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఈరోజు గుడివాడలో మీడియాతో మాట్లాడారు.


 అత్యంత పిరికి వ్యక్తి, విచారణలు ఎదుర్కోలేని చవట దద్దమ్మగా ఈ భారత దేశంలో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు. 


ఆయనను చంద్రబాబునాయుడు అని అంటారు. స్టేలు బాబు కూడా పిలుస్తారు. 


చంద్రబాబు, స్టేలు బాబు అన్నా  చంద్రబాబే  



 మళ్లీ స్టేలు బాబు స్టే తెచ్చుకున్నాడు 


 హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి ఈ కేసును పూర్తిగా తీసివేయమని కోరాడు.


కోర్టు నాలుగు వారాల పాటు విచారణ ఆపమని స్టే ఇచ్చింది 


 మిగిలిన విచారణను కొనసాగించమని చెప్పింది 


చంద్రబాబుకు ఉన్న మేనేజ్మెంట్, పలుకుబడిని ఉపయోగించుకుని కోర్టుల్లో స్టేలు  తెచ్చుకుంటాడు 


సుప్రీం కోర్టు నుండి లక్షలు,  కోట్లు ఖర్చుపెట్టి పెద్ద పెద్ద లాయర్లను తెచ్చుకుంటాడు 


 తాత్కాలికంగా ఆపుకుంటాడు కానీ ప్రజా కోర్టు అనేది ఒకటి ఉంటుంది. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు 


 ఇప్పటికే చంద్రబాబుకు అనేకసార్లు బుద్ధి చెప్పారు 


 రేపు రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్, మండల పరిషత్  ఎన్నికలు, తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలు వేసే శిక్షతో చంద్రబాబు నాయుడును రోడ్డు మీదకు రాకుండా ఇంటికి పరిమితం చేస్తారు.


అతి భయంకరమైన శిక్షను చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Comments