ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో మాదకద్రవ్యాల

 

డి‌జి‌పి కార్యాలయం.(ప్రజా అమరావతి);

 


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో మాదకద్రవ్యాల


మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కఠినంగా వ్యవహరించాలని అందుకు అనుగుణంగా మారక ద్రవ్యాల వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు  వివరిస్తూ వారిని  చైతన్య పరుస్తూ, మాదకద్రవ్యాలు   పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు , మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్న వారిపైన  కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  వై.ఎస్ జగన్మోమోహన్ రెడ్డి గారు ఎస్‌ఈబీ, పోలీసులకు ఇచ్చిన  ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయిలో మారక ద్రవ్యాల నిరోధానికి టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు పైన  ఈరోజు మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో శ్రీ . డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో అడిషనల్ డీజీ లా & ఆర్డర్ శ్రీ  రవి శంకర్ అయ్యనార్, ఎస్‌ఈబి కమిషనర్ శ్రీ వినీత్ బ్రిజ్ లాల్  నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు, ద్రవ్యాలు సేవించడం ద్వారా జరిగే అనర్థాలను వివరించేందుకు  తీసుకోవాల్సిన చర్యలు అందుకు అధికారుల పైన ఉన్న బాధ్యతలను వివరించేందుకు కీలక  సమావేశం నిర్వహించడం జరిగింది.


.రాష్ట్ర స్థాయి జాయింట్ టాస్క్ ఫోర్స్ (జెటిఎఫ్) డైరెక్టర్(ఎస్‌ఈబీ),  జిల్లా ఎస్పీలతో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ టాస్క్ ఫోర్స్  నిరంతరం మారక ద్రవ్యాల నిరోధానికి చేపట్టే చర్యలను పర్యవేక్షించడం, వివిధ శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుంది. 


 జిల్లాస్థాయిలో అడిషనల్ ఎస్పి(సెబ్)  పోలీస్ , స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది. డిస్టిక్ లెవెల్ టాస్క్ఫోర్స్ టీం జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నిరోధానికి, కట్టడికి, దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు క్షేత్రస్థాయిలో  పోలీస్స్టేషన్ మొదలుకొని జిల్లా స్థాయి సిబ్బంది కూడా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేస్తూ నిరోధానికి చర్యలు తీసుకుంటారు.ప్రజలలో అవగాహన చర్యలు చేపడతారు.    


సిబ్బందికి సిబ్బందికి దిశానిర్దేశం


జిల్లా స్థాయిలో మారక ద్రవ్యాలు నిరోధానికి కఠిన చర్యలు తీసుకునే విధంగా 24 గంటల పాటు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు, ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్, వాట్సాప్ నెంబర్లు ఏర్పాటు తో నిరంతరం వివిధ శాఖలతో సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి కట్టడి చేయడం, మత్తుకు బానిస అయిన విద్యార్థుల పై ప్రత్యేక నిఘా తో పాటు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేయడం అందుకు అనుగుణంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంతే కాకుండా మరో పక్క మాదక ద్రవ్యాలు విక్రయాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపే విధంగా చర్యలు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తరచుగా మాదక ద్రవ్యాల విక్రయాలకు  పాల్పడుతున్న వారిని గుర్తించడం వారిపైన పిడియాక్ట్ నమోదు చేయటం, విదేశీ విద్యార్థుల పైన నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వారిపైన రౌడీషీట్లు, బైండోవర్ చేయడం వంటి చర్యలు తీసుకునే విధంగా ఈ సమావేశంలో సిబ్బందికి దిశానిర్దేశం చేయడం జరిగింది.


 క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు 

 

మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాలు పై క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, సామాజిక మాధ్యమాల్లో షార్ట్ ఫిలింస్ ద్వారా అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలకు బానిస అయిన వారిని గుర్తించి వారికి, కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించడం, పెద్ద ఎత్తున డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు, కౌన్సిలింగ్ సెంటర్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలపైన సమావేశం లో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ కమిషనర్, ఏలూరు, గుంటూరు డీఐజీలు,  కృష్ణా, గుంటూరు జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీస్,  సెబ్  అధికారులు పాల్గొన్నారు.