క్యాంపు కార్యాలయంలో ఆధునీకరించిన నూతన స్పందన పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.క్యాంపు కార్యాలయంలో ఆధునీకరించిన నూతన స్పందన పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.అమరావతి (ప్రజా అమరావతి):


మరింత ఆధునీకరించిన నూతన స్పందన పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

పాత పోర్టల్‌లో 2677 సబ్జెక్టులు, 27,919 సబ్‌ సబ్జెక్టులు

అప్‌డేషన్‌ చేసిన పోర్ట్‌ల్‌లో 858 సబ్జెక్టులు,  3758 సబ్‌ సబ్జెక్టులు

దీనివల్ల చాలావరకూ సమయం ఆదా

గ్రామ, వార్డు సచివాలయాలు లక్ష్యంగా కొత్త స్పందన పోర్టల్‌

పౌరులు నేరుగా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం

గ్రామ సచివాలయాల ద్వారా కాని, కాల్‌ సెంటర్‌ ద్వారా కాని, వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా కాని, మొబైల్‌ యాప్‌ ద్వారా కాని, ప్రజా దర్బార్ల ద్వారా కాని వినతులు ఇచ్చే అవకాశం

తీసుకున్న వినతులు అత్యంత తీవ్రమైనవి, తీవ్రమైనవి, సాధారణమైనవిగా వర్గీకరణ

తాము ఇచ్చిన వినతి లేదా, దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మూడు ఆప్షన్స్‌

వెబ్‌ లింక్‌ ద్వారా లేదా 1902కు కాల్‌చేసి లేదా, గ్రామ సచివాలయాల ద్వారా తెలుసుకునే అవకాశం

తాము చేసిన వినతి పరిష్కారం పట్ల పౌరుడు సంతృప్తి చెందకపోతే తిరిగి మళ్లీ అదే ఫిర్యాదును ఓపెన్‌ చేసి జిల్లాస్థాయిలో లేదా విభాగాధిపతిస్థాయిలో మళ్లీ విజ్ఞాపన చేయవచ్చు

సేవలపట్ల పౌరుడు నుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటారు

వినతుల పరిష్కారంలో నాణ్యత ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో సర్వేలు

థర్డ్‌ పార్టీ ఆడిట్‌కూడా జరుగుతుంది


పౌరుడు వినతిపత్రం ఇచ్చాక అది పరిష్కారం అయ్యే తీరును నేరుగా అధికారులు, ఉన్నతాధికారులు ట్రాక్‌ చేయాలి: సీఎం

ఈ ట్రాకింగ్‌ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలి: సీఎం

పౌరులనుంచి గ్రీవెన్స్‌లను పరిష్కారించకుండా పక్కనపడేసే పరిస్థితి ఉండకూడదు:

నేరుగా సీఎం కార్యాలయ అధికారులు కూడా గ్రీవెన్స్‌ల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పరిశీలన, సమీక్ష చేయాలి: సీఎం ఆదేశం

గ్రీవెన్స్‌ను తిరస్కరిస్తున్నప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారో కచ్చితంగా చెప్పగలగాలి:

అలాగే పౌరుడు నుంచి వచ్చిన  గ్రీవెన్స్‌ పరిష్కారానికి అర్హమైనదిగా గుర్తించిన తర్వాత తప్పకుండా దాన్ని పరిష్కరించాలి :

నిర్ణీత సమయంలోగా గ్రీవెన్స్‌ పరిష్కారం కాకపోతే అది ఏస్థాయిలో నిలిచిపోయింది అన్నది తెలియాలి :

సంబంధిత సిబ్బంది, అధికారికి అలర్ట్స్‌ వెళ్లాలి:

స్పందన వినతుల పరిష్కారమనేది కలెక్టర్ల పనితీరుకు ప్రమాణంగా భావిస్తాం: సీఎం


*పటిష్టంగా నవరత్నాలు అమలు*

నవరత్నాల్లో ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి: సీఎం 

నవరత్న పథకాల సోషల్‌ ఆడిట్‌ సమయంలోనే అర్హులైన వారి పేర్లు రాలేదని తెలిసిన వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి:

అయినప్పటికీ ఎవరైనా మిగిలిపోయిన పక్షంలో పథకం అమలు చేసిన తేదీ నుంచి నెలరోజుల పాటు వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలి :

తర్వాత నెలలో వెరిఫికేషన్‌ చేయాలి :

వాటిని వెంటనే పరిష్కరించి.. మూడో నెలలో వారికి నిధులు విడుదల చేయాలి :

అప్పటితో ఆ స్కీం సంపూర్ణంగా ముగిసినట్టు అవుతుంది :


*అర్హులందరికీ ఇళ్ల పట్టా*

దరఖాస్తు చేసిన 90 రోజుల్లో ఇంటి పట్టా అందాలి: సీఎం

కచ్చితంగా 90 రోజుల్లో ఇంటి పట్టా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి:

నిర్ణీత సమయంలోగా ఇంటిపట్టా అందించాల్సిన బాధ్యత అధికారులదే: సీఎం

దరఖాస్తు చేసిన 90 రోజుల్లోగా ఇంటి పట్టా అందించాలన్నది ప్రభుత్వ కృతనిశ్చయం: సీఎం

సుమారు లక్ష వరకూ ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు మళ్లీ వచ్చాయన్న అధికారులు

వెరిఫికేషన్‌ చేశామని సీఎంకు వివరించిన అధికారులు

మొత్తం దరఖాస్తులన్నంటినీ కూడా మరోసారి వెరిఫై చేసి, అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం

వచ్చే నెలలో ఇంటి పట్టాలకు సంబంధించి దరఖాస్తుల రీ వెరిఫికేషన్‌ పూర్తిచేయాలన్న సీఎం

దరఖాస్తులను తిరస్కరించేముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించాలన్న సీఎం

అర్హులన్నవారు ఎవ్వరూ కూడా మిగిలిపోకూడదని అధికారులకు సీఎం ఆదేశాలు


ఈ కార్యక్రమంలో ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్యదర్శి విజయకుమార్, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ మల్లిఖార్జున, ఆర్టీజీఎస్‌ సీఈఓ జే విద్యాసాగర్ రెడ్డి ఇతర  ఉన్నతాధికారులు హాజరు.