ఘనంగా జనార్ధన స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు.

 ఘనంగా జనార్ధన స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు.     


                  కొల్లిపర (ప్రజా అమరావతి); స్థానిక శ్రీదేవి భూదేవి సమేత జనార్దనా స్వామి వారి ఆలయంలో శనివారం స్వామివారిని పెండ్లికొడుకు గా అలంకరించి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పరాశరమ. జగన్నాథచార్యులు మాట్లాడుతూ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా నేడు ధ్వజస్తంభ గరుడా పతాకం ఎగుర వేస్తాము అన్నారు. సోమవారం రాత్రికి ఎదుర్కోలు ఉత్సవం ఉత్సవం స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కావున భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు అన్నారు తీర్థ ప్రసాదములు స్వీకరించాలని తెలిపారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు 26వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు.

Comments