రాష్ర్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు .

 


ఏపి సెక్రటేరియట్ (ప్రజా అమరావతి); సచివాలయంలో రాష్ర్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ  బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు .


ఈ సమావేశంలో బీసీ స్కూల్స్ మరియు హాస్టల్స్ విద్యార్దులకు కోవిడ్ పరీక్షల నిర్వహణ, మాస్కులు ధరించడం, శానిటైజర్ల వినియోగంపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆదేశించారు.


రాష్ర్టంలోని బీసీ హాస్టల్స్ లో భోజన వసతి ఏర్పాట్లు, నాణ్యమైన భోజనం బీసీ వసతీగృహాల్లో కల్పించేలా చర్యలు చేపట్టాలని, మెరుగైన మౌలిక వసతులు అందించేలా అధికారులను అదేశించారు. బీసీ  హాస్టల్స్, స్కూల్స్ లలో  మరుగుదొడ్ల నిర్వహణ, శానిటేషన్ చర్యలపై అధికారులతో మంత్రి ఆరా తీసారు. 


ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనకు అనుగుణంగా దేశంలోనే ఉత్తమమైన పాఠశాలలుగా బీసీ సంక్షేమ పాఠశాలలను రూపుదిద్దాలని, దీనికోసం మౌలిక సదుపాయాల కల్పనలో మన శాఖ రోల్ మోడల్ గా వుండాలని అధికారులకు చెప్పారు. 


ఈ సమీక్షాసమావేశంలో బీసీ వెల్పేర్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాములు-ఐఏఎస్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. రామారావు- ఐఏఎస్, జ్యోతిరావు ఫూలే స్కూల్స్ సెక్రటరీ కృష్ణమోహన్ పాల్గొన్నారు.