పరిపాలనలో మానవీయత.. అదే జగనన్న ప్రత్యేకత ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాః సహాయం పొందిన మహిళల కృతజ్ఞతాభావం విజ
యనగరం, మార్చి 31 (prajaamaravathi); గంట్యాడ మండలం కొత్త వెలగాడ గ్రామానికి చెందిన చౌడువాడ గంగునాయుడు తాపీ పని చేసుకొంటూ రోజువారీ ఆదాయంతో, భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తూ జీవనం సాగిస్తున్న ఒక నిరుపేద కార్మికుడు. గత ఏడాది డిసెంబరు 21న ఆయన ఆకస్మాత్తుగా ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. అంతే ఆ కుటుంబానికి దిక్కుతోచని స్థితి. భార్య సునీతకు పిల్లలను ఎలా పోషించాలో, వారిని ఎలా చదివించి పెద్దవారిని చేయాలో ఆలోచించే పరిస్థితి కూడా లేదు. వై.ఎస్.ఆర్.బీమా పథకం ఆదుకొంటుందని అనుకుంటే బ్యాంకు ఖాతా తెరవకపోవడంతో అది కూడా దక్కలేదు. ఇటువంటి సమయంలో బ్యాంకు ఖాతాలేని కుటుంబాలకు ప్రభుత్వమే నేరుగా క్లెయిమ్ మొత్తం చెల్లించాలన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం చౌడువాడ సునీత కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చింది. జిల్లా కలెక్టర్, ఎం.పి., ఎమ్మెల్యేల చేతుల మీదుగా వై.ఎస్.ఆర్.బీమా సహాయం అందుకొంటూ ఆమె ముఖ్యమంత్రి అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపిన ఆమె కళ్లనీళ్ల పర్యంతమయ్యింది. ముఖ్యమంత్రి జగనన్నకు నేను నా పిల్లలు జీవితాంతం రుణపడి ఉంటామని ఎంతో కృతజ్ఞతా భావంతో చెప్పిన ఆమె ఈ సహాయాన్ని తన జన్మలో మరచిపోలేనని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వై.ఎస్.ఆర్.బీమా కింద రూ.5 లక్షల రూపాయలను ఈ కుటుంబానికి అందజేసింది. తనకు ఒక పాప, బాబు ఉన్నారని ఇద్దరూ ఒకటి, రెండు తరగతులు చదువుతున్నారని వారిని ఎలా చదివించాలని ఆలోచిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జగనన్న అందించిన సహాయం ఎన్నటికీ మరచిపోలేనని పేర్కొంది. జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు లేని వ్యక్తులు మరణించిన కుటుంబాలకు చెందిన 454 మందికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లా యంత్రాంగం ద్వారా రూ.9.93 కోట్ల సహాయం అందించారు. ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నుండి గత ఏడాది వైదొలగడంతో గత అక్టోబరు నుండి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిధులను చెల్లించి ఈ బీమాను వర్తింపచేస్తోంది. 1.41 కోట్ల కుటుంబాల తరపున రూ.510 కోట్లు ప్రీమియంగా చెల్లించింది. అయితే పలు కారణాల వల్ల వీరిలో 1.20 కోట్ల మందికే బ్యాంకు ఖాతాలు తెరవగలిగారు. ఈ బీమా నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతా ద్వారా ప్రీమియం చెల్లించిన వారికే ఈ పథకం ప్రయోజనాలు వర్తిస్తాయి. అయితే బ్యాంకు ఖాతా లేని కుటుంబాలకూ ఈ పథకం ప్రయోజనాలు వర్తింపచేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మానవీయతా దృక్పథంతో చేసిన ఆలోచన జిల్లాలో 454 కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఉపయోగపడింది. వారంతా తాము వై.ఎస్.ఆర్.బీమా దక్కుతుందో లేదోననే ఆశలు వదులుకున్న తరుణంలో ఈ సహాయం అందడంలో ఆయా కుటుంబాలు ఎంతో సంతోషం వ్యక్తంచేస్తున్నాయి. తాము ఎన్నుకున్న పాలకులు తమకు సేవకులుగా ఉంటూ ఈ స్థాయిలో అందించడం పట్ల వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
addComments
Post a Comment