అనంతపురం (ప్రజా అమరావతి);
మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.
*" తెలుసుకో... ఎదుగు.." (Know & Rise) అనే వినూత్న కార్యక్రమంను కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ప్రారంభించిన జిల్లా కలెక్టర్*
*"తెలుసుకో... ఎదుగు.." (Know & Rise) కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం నగరం రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ కు చెందిన 15 మంది విద్యార్థినీవిద్యార్థులు హాజరు...*
*ప్రభుత్వ పరిపాలన మరియు కార్యకలాపాలపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన, నిర్ణయ సామర్థ్యం మరియు నాయకత్వ లక్షణాలు వెలికి తీయడానికి, వారిని రేపటి మార్గదర్శకులుగా తయారుచేయడానికి "తెలుసుకో... ఎదుగు..." (Know & Rise) అనే కార్యక్రమం నిర్వహణ - జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు*
*తెలుసుకో..ఎదుగు కార్యక్రమంలో భాగంగా తొలిరోజు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డి ఈ ఓ, ఎం ఈ ఓలు, హెడ్మాస్టర్ లతో నిర్వహించిన సమావేశంలో విద్యార్థులను భాగస్వాములను చేసిన కలెక్టర్*
*సమావేశం ముగిసిన అనంతరం సమావేశంలో ఎలాంటి అంశాలు గమనించారు అనే విషయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్.. తమ అభిప్రాయాలను వెల్లడించిన విద్యార్థినీ విద్యార్థులు..*
*ప్రభుత్వ పరిపాలన పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం కల్పించడం, జిల్లా పరిపాలనా యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందనే దానిపై అవగాహన కల్పించడానికి తెలుసుకో..ఎదుగు లో భాగంగా ఇకపై కూడా ఇలాంటి సమీక్షా సమావేశాల్లో ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులను భాగస్వాములను చేసి వారి ఎదుగుదలకు కృషి చేస్తాం...జిల్లా కలెక్టర్*
addComments
Post a Comment