అమరావతి (ప్రజా అమరావతి);
జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమంపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
*కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్*
*ఉపాధిహామీ పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ (రూరల్), 90 రోజుల్లో ఇంటిపట్టా, నాడు –నేడు, స్పందన, చేయూత, అర్బన్ ప్రాంతాల్లో మధ్యతరగతికి లాభాపేక్షలేకుండా సరసమైన ధరలకు ఇంటి స్థలాలు తదితర అంశాలపై సీఎం సమీక్ష.*
*ఏప్రిల్, మే నెలల్లో అమలు చేయనున్న స్కీంలు, కార్యక్రమాలపైనా సీఎం సమీక్ష*
*ఉపాధి హామీ*
ఉపాధిహామీ పనులను రికార్డు స్థాయిలో చేపట్టారు, అందరికీ అభినందనలు : సీఎం శ్రీ వైయస్.జగన్
25.50 కోట్ల పనిదినాలను కల్పించారు: సీఎం
రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు:
కోవిడ్ సమయంలో కూలీలను ఆదుకున్నారు:
దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాం:
చిన్నరాష్ట్రమైనా మనం మూడో స్థానంలో ఉండడం గర్వకారణం:
రూ. 5,818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగాం:
ఏప్రిల్, మే, జూన్ నెలలో కొన్నిరోజుల వరకూ పనులు ముమ్మరంగా చేసుకునేందుకు అవకాశం ఉన్న సమయం ఇది:
ఇదే వేగంతో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరగాలి:
ఉపాధిహామీ పథకాన్ని కలెక్టర్లు ఓన్ చేసుకోవాలి:
ప్రతి 4–5 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా రివ్యూ చేయాలి:
జాయింట్ కలెక్టర్లు కూడా ఉపాధిహామీ పథకంపై దృష్టిపెట్టాలి:
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్కులు తదితరవాటి భవన నిర్మాణాలు వేగంగా జరగాలి: అధికారులకు సీఎం ఆదేశం
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ భవనాల నిర్మాణంపై పూర్తి దృష్టిపెట్టాలి:
గ్రామ సచివాలయాల నిర్మాణంలో కొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయి:
ఆ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి:
మే నాటికల్లా గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలి:
రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో రెండు, మూడు జిల్లాలు ఇంకా మెరుగుపడాల్సి ఉంది:
జులై 8న వైయస్సార్‌గారి పుట్టినరోజు సందర్భంగా ఆర్బీకేలను ప్రారంభిస్తున్నాం:
ఖరీఫ్ ప్రారంభం సందర్భంగా ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది:
అందుకే పనులను చాలా ముమ్మరంగా పనులు చేయాల్సి ఉంది: కలెక్టర్లకు సీఎం ఆదేశం
కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి విలేజ్ క్లినిక్కులు ఆవశ్యకత ఉంది:
వీలైనంత త్వరగా వీటి పనులను పూర్తిచేయాల్సి ఉంది:
యుద్ద ప్రాతిపదికిన క్లినిక్స్ నిర్మాణం జరగాలి:
ఆగస్టు 15న వీటిని ప్రారంభించాలనుకుంటున్నాం :
అందుకే పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి:
గ్రామస్థాయిలో ఆరోగ్యశ్రీ రిఫరెల్ పాయింట్‌గా విలేజ్ క్లినిక్స్ ఉంటాయి:
*బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు(బీఎంసీలు)*
9899 చోట్ల బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్ల (బీఎంసీల)ను ఏర్పాటు చేయాల్సి ఉంది:
3841 చోట్ల పనులు మొదలయ్యాయి:
మిగిలిన చోట్ల కూడా వెంటనే పనులు మొదలుకావాలి:
ఆగస్టు 31 నాటికి బీఎంసీల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి:
సెప్టెంబరులో ఈ బీఎంసీలను ప్రారంభించబోతున్నాం:
*పుడ్ ప్రాససింగ్ యూనిట్లు*
25 ఫుడ్ ప్రాససింగ్ యూనిట్లను పెట్టబోతున్నాం:
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక యూనిట్‌ఉంటుంది:
దీనికోసం భూములను గుర్తించి.. అక్కడ యూనిట్లను పెట్టించాలి:
కనీసం 10 నుంచి 15 ఎకరాల భూమిని గుర్తించాల్సి ఉంది:
ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటిని ప్రాసెస్ చేయడానికి ఈ యూనిట్లు ఉపయోగపడతాయి:
గత ఏడాది కాలంలో రైతులను ఆదుకునేందుకు గత సంవత్సరం రూ.4300 కోట్లు ధరల స్థిరీకరణకు ఖర్చు చేశాం:
*ఇళ్లపట్టాలు :*
దరఖాస్తు చేసుకున్నవారు అర్హులని తేలితే 90 రోజుల్లోగా వారికి ఇంటిపట్టా ఇవ్వాలి: సీఎం
94శాతం ఇళ్లపట్టాల పంపిణీ పూర్తయ్యింది
మిగిలిపోయిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీచేయాలి:
జిల్లాకలెక్టర్లు దృష్టిపెట్టి వెంటనే పంపిణీచేయాలి:
అలాగే టిడ్కోలో పంపిణీ చేయాల్సి ఉన్న సుమారు 47వేల ఇళ్లపట్టాలను వెంటనే పూర్తిచేయాలి:
అర్హులైన వారికి కచ్చితంగా ఇళ్లపట్టాలు ఇవ్వాలి:
పెండింగులో ఉన్న అప్లికేషన్లను వెంటనే వెరిఫికేషన్ చేసి... అర్హులకు పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి:
కొత్తగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అవసమైన చోట వెంటనే భూమిని సేకరించాలి:
ఇళ్లపట్టాల దరఖాస్తులను తిరస్కరించేటప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నామో చెప్పగలగాలి:
కారణాలు లేకుండా దరఖాస్తులను తిరస్కరించరాదు:
ఒకవేళ దరఖాస్తును తిరస్కరించిన తర్వాత కూడా, తగిన కారణాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది:
అలాంటి దరఖాస్తులను మళ్లీ రీ వెరిఫికేషన్ చేయాలి:
నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కింద తొలివిడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నాం:
ఇళ్లనిర్మాణం జరగడానికి వీలుగా లే అవుట్‌లో బోరు, కరెంటు సౌకర్యం ఉండాలి:
తొలివిడతలో 8682 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది:
ప్రతిచోటా బోరు, కరెంటు సౌకర్యం కచ్చితంగా ఉండాలి:
ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది:
ఆలోగా బోరు, కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయడంపట్ల అధికారులు చర్యలు తీసుకోవాలి:
ఇళ్ల నిర్మాణానికి సన్నాహకంగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, ఏపీ హౌసింగ్ వెబ్‌సైట్‌లో లబ్ధిదారుని రిజిస్ట్రేషన్, ఉపాధి హామీ కింద జాబ్‌కార్డుల జారీ ఈ పనులన్నీకూడా ఏప్రిల్ 10లోగా పూర్తికావాలి: సీఎం
హౌసింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లా, డివిజన్ స్థాయి అధికారులను ప్రతి మండలానికీ, ప్రతి మున్సిపాల్టీకి నోడల్ అధికారులుగా నియమించాలి:
ప్రతి లే అవుట్‌లో కచ్చితంగా ఒక మోడల్ హౌస్‌ను నిర్మించాలి:
దీనివల్ల ఇళ్లనిర్మాణంలో వస్తున్న ఇబ్బందులు, నిర్మాణఖర్చు ఎంత అవుతుంది అన్నదానిపై అవగాహన వస్తుంది, అంతేకాకుండా కట్టిన ఇల్లు ఎలా ఉందో లబ్ధిదారులకు తెలుస్తుంది:
ఏప్రిల్ 15 నాటికి మోడల్ ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాలి:
ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, డిజిటిల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్ల సేవలను ఇళ్లనిర్మాణంలో వినియోగించుకోండి:
లబ్ధిదారుల ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం సిమెంటు, స్టీల్, ఇసుక, మెటల్, ఇటుకలు అందించడానికి సిద్ధంచేసుకోండి:
నిర్మాణ సామగ్రిలో కచ్చితంగా క్వాలిటీ ఉండాలి:
ఒకవైపు ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగానే.. మరో వైపు కాలనీలో చేపట్టాల్సిన రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు... ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనపై కార్యాచరణ రూపొందించాలి:
*ఏప్రిల్‌లో నాడు-నేడు(పాఠశాల విద్యాశాఖ) రెండో విడత*
ఏప్రిల్ నెలాఖరులో రెండో విడతలో పాఠశాలల్లో నాడు–నేడు పనులు:
కొన్నిచోట్ల పెయింటింగ్ పనులు తప్ప మొదట విడత కింద 15,715 పాఠశాలల్లో నాడు – నేడు కింద పనులు పూర్తయ్యాయని సీఎంకు వివరించిన అధికారులు
15 రోజుల్లో పెయింటింగ్ పనులు పూర్తవుతాయని తెలిపిన అధికారులు
జాయింట్ కలెక్టర్‌తో కలిపి కలెక్టర్ రివ్యూ చేయాలి: సీఎం
పాఠశాల్లో జరిగిన నాడు – నేడు పనులపై ఆడిట్ చేయాలి:
థర్డ్‌పార్టీ ఏజెన్సీతో క్షేత్రస్థాయిలో అడిటింగ్ చేయించాలి: సీఎం ఆదేశం
స్వయం సహాయక సంఘాల మహిళలనుంచి పాఠశాలల్లో పనులు సరిగ్గా జరిగాయా? లేదా? అన్న దానిమీద పరిశీలన చేయించాలి:
పెయింట్ పనులుకూడా వేగంగా జరిగేలా చూడాలి:
ఏప్రిల్ నెలాఖరున నాడు –నేడు కింద అభివృద్ధిచేసిన స్కూళ్లను ప్రజలకు అంకింత చేస్తాం : సీఎం
తర్వాత రెండో విడతలో మిగిలిన స్కూళ్లలో నాడు – నేడు పనులు చేపడతాం:
పాఠశాలలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచడానికి ఎస్‌ఓపీని తయారు చేయాలి:
స్కూల్లో ఏదైనా సమస్య వస్తే వెంటనే దాన్ని పరిష్కరించాలి:
గోరుముద్ద, టాయిలెట్‌మెయింటినెన్స్, అలాగే రెగ్యులర్ మెయింటినెన్స్‌మీద ఎస్‌ఓపీని రూపొందించాలి:
*అంగన్ వాడీల్లో నాడు-నేడు*
55,607 అంగన్ వాడీ సెంటర్లను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం:
ఇంగ్లిషు మీడియంలో బోధన ఉంటుంది:
2021–22 లో 20,011 అంగన్ వాడీలు,
2022–23లో 16,072, 2023–24లో 8036 అంగన్‌వాడీల్లో నాడు – నేడు కింద అభివృద్ధి పనులు, కొత్తవాటి నిర్మాణాలు:
16,681 చోట్ల అభివృద్ధి పనులు, 27,438 చోట్ల కొత్త భవనాల నిర్మాణం:
ఇవికాక 11,488 అంగన్‌వాడీల్లో నాడు – నేడు పనులను పాఠశాల విద్యాశాఖ చేపడుతుంది:
ఏప్రిల్ మూడో వారంలో ఈ పనులు ప్రారంభం
ఏప్రిల్15లోగా అవసరమైన వాటికి స్థలాలను గుర్తించాలి:
అలాగే అంగన్‌వాడీలకు శిక్షణ ఇవ్వడంపై దృష్టిపెట్టాలి:
*స్పందన–గ్రీవెన్సెస్‌పై సీఎం:*
స్పందనపై ప్రత్యేక దృష్టిపెట్టాలి:
నిర్ణీత సమయంలోగా సేవలు ప్రజలకు అందాలి. అర్జీలు పరిష్కారానికి నోచుకోవాలి:
540 సేవలకు సంబంధించి స్పందన కింద అర్జీలు స్వీకరించాలి:
నిర్ణీత సమయంలోగా మనం వాటిని సరిష్కరించడంపై దృష్టిపెట్టాలి:
స్పందనకు సంబంధించి ఈ కార్యక్రమం 9 జూన్ 2020 లో ప్రారంభమైంది :
అప్పటి నుంచి రైస్ కార్డు, పించన్ కార్డు, హౌస్ సైట్స్, ఆరోగ్యశ్రీ కార్డు కేవలం ఈ నాలుగు అంశాలకు సంబంధించి 48,96,219 వినతులు వచ్చాయి :
పెన్షన్‌కార్డు, రైస్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇంటి పట్టాలకు సంబంధించి స్పందన కింద అందించిన అర్జీలను 95శాతం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాం:
నూటికి నూరుశాతం వినతులను పరిష్కరించాలి:
దీనికోసం పరిష్కరించాల్సిన గడువును కూడా పెంచుతున్నాం:
రైస్ కార్డు 21, పెన్షన్ కార్డు 21, ఆరోగ్యశ్రీ కార్డు 21, ఇంటిపట్టా 90 రోజుల్లోగా అందించాలి
తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు తదితర ప్రజాసమస్యల పరిష్కారానికీ ప్రాధాన్యత నివ్వాలి:
కలెక్టర్లు క్రమం తప్పకుండా స్పందనపై సమీక్ష చేయాలి:
సీఎంఓ కార్యాలయ అధికారులు కూడా ప్రతి గురువారం కూడా నిర్ణీత సమయంలోగా ఈ వినతులను పరిష్కరిస్తున్నారా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలి:
స్పందన వెబ్‌సైట్‌ను కూడా మెరుగుపరిచాం:
వినతులు ఏస్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది:
ఒకవేళ అర్జీ ఏస్థాయిలోనైనా నిలిచిపోతే వెంటనే అలర్ట్స్ కూడా వస్తాయి:
గ్రామ సచివాలయ స్థాయి నుంచి పై స్థాయిలో ఉన్న సెక్రటరీ లెవల్ వరకూ కూడా ఈ విధానం ఉంటుంది:
*చేయూత:*
జూన్‌లో చేయూత కింద మహిళలకు డబ్బులు : సీఎం
పాల వెల్లువ, జీవ క్రాంతి కింద మహిళల సుస్థిర ఆర్థిక ప్రగతికి కోసం బ్యాంకులతో టై అప్ అయిన యూనిట్లను వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలి:
ఏప్రిల్ 10లోగా మిగిలిన వారికి ఈ యూనిట్లు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలి:
*ఎంఐజీ లే అవుట్స్*
అర్బన్ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్నది మా ఉద్దేశం: సీఎం శ్రీ వైయస్.జగన్
న్యాయపరంగా చిక్కుల్లేని విధంగా క్లీన్ టైటిల్‌తో ఇళ్లస్థలాలు:
దీనికోసం పట్టణాలు, నగరాల్లో కనీసం 100 నుంచి 150 ఎకరాలు సేకరించాలి:
లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ప్లాట్లను సరసమైన ధరలకు అందిస్తుంది:
లే అవుట్లలో సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు, ఓపెన్‌ఎయిర్‌జిమ్, వాకింగ్ ట్రాక్స్, ఎలక్ట్రిసిటీ లైన్స్, పచ్చదనం, స్మార్ట్ బస్‌స్టాప్‌లు.. ఇవన్నీ ఉండేలా చర్యలు తీసుకోవాలి:
ప్లాట్లుకు ఉన్న డిమాండ్‌పై సర్వే చేయాలి:
డిమాండ్‌ను అనుసరించి భూమిని సేకరించాలి:
ఎంఐజీ –1లో 150 చదరపు గజాలు, ఎంఐజీ–2లో 200 గజాలు, ఎంఐజీ-3లో 240 గజాల కింద ప్లాట్లు:
ఒక కుటుంబానికి ఒకటే ప్లాటు:
*ఏప్రిల్ నెలలో పథకాలు, కార్యక్రమాలు:*
వలంటీర్లకు సత్కారం – ఏప్రిల్ 13న ప్రారంభం
జగనన్న విద్యాదీవెన – ఏప్రిల్ 16న
విద్యాదీవెన కింద డబ్బులు ఇప్పటి నుంచి నేరుగా తల్లి అక్కౌంట్లోకి.
ప్రతి త్రైమాసికం డబ్బులు తల్లు అక్కౌంట్లోకి.
ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు లేకుండా విడుదలచేశాం.
వైయస్సార్ సున్నా వడ్డీ రైతులకు (రబీ 2019కి) – ఏప్రిల్ 20న
డబ్బులు నేరుగా రైతుల అక్కౌంట్లోకి అందిస్తాం:సీఎం
బ్యాంకర్లు డేటాను అప్‌లోడ్ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి:
వైయస్సార్ సున్నా వడ్డీ ( డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు) – ఏప్రిల్ 23న
డబ్బులు నేరుగా డ్వాక్రా అక్కచెల్లెమ్మల అక్కౌంట్లోకి: సీఎం
జగనన్న వసతి దీవెన – ఏప్రిల్ 28న
ఏప్రిల్ నెలఖారులో నాడు - నేడు రెండో విడత
ఏప్రిల్ మూడో వారంలో అంగన్‌వాడీల్లో నాడు - నేడు
*మే లో అమలు చేయనున్న పథకాలు, కార్యక్రమాలు*
వైయస్సార్ రైతు భరోసా – మే 13న
మత్స్యకార భరోసా – మే 18న
ఖరీఫ్ బీమా (2020) – మే 25న
పథకాల అమలు, కార్యక్రమాలకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవాలి:
అర్హులు ఎవ్వరూ మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలి:
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సోషల్ ఆడిటింగ్ చేయించాలి:
*కోవిడ్ నివారణా చర్యలు-వ్యాక్సినేషన్*
కోవిడ్ నివారణాపై అధికారులు చర్యలు తీసుకోవాలి:
ఎల్లుండి(గురువారం) నేను కూడా వ్యాక్సిన్ తీసుకుంటున్నాను:
వ్యాక్సినేషన్‌ను ముమ్మరంగా చేపట్టడమే ఇప్పుడు మనముందున్న కర్తవ్యం:
వ్యాక్సినేషన్ ద్వారానే కోవిడ్‌సమస్యకు పరిష్కారం లభిస్తుంది:
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కేవలం 6 రోజుల ప్రక్రియ మిగిలి ఉంది:
ఇదికూడా పూర్తైతే ఇక ఎన్నికలు ముగిసినట్టే
ఇక ఆ తర్వాత దృష్టి అంతా వ్యాక్సినేషన్ పైనే:
ఏప్రిల్ 1 నుంచి మొదటి అర్బన్ ప్రాంతాలపై వ్యాక్సినేషన్‌పై దృష్టి
వార్డు, గ్రామ సచివాలయాల యూనిట్‌గా ఉధృతంగా వ్యాక్సినేషన్‌ను చేపట్టాలి: సీఎం
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ ఆర్ అనురాధ, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, సివిల్ సప్లైస్ కమిషనర్ కోన శశిధర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మల్లిఖార్జున, ఇతర ఉన్నతాధికారులు హాజరు.
addComments
Post a Comment