*For Media Information*
అమరావతి (ప్రజా అమరావతి);
ఆంధ్రప్రదేశ్ లో 'కంటైనర్ల తయారీ యూనిట్'ను నెలకొల్పాలని కోరాం : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
*కంటైనర్ కార్పొరేషన్ కూడా ఏపీలో ఏర్పాటు చేయాలని సీఓఎన్ సీఓఆర్ సీఎండీ వి. కల్యాణరామను కోరిన పరిశ్రమల శాఖ మంత్రి*
*చైనా నుంచి ఎగుమతులు, దిగుమతుల నిషేధం నేపథ్యంలో సరకు రవాణాకు దేశవ్యాప్తంగా ఉన్న కంటైనర్ల కొరత నేపథ్యంలో తీరప్రాంతం ఎక్కువగా ఉన్న ఏపీలోని పోర్టుల సమీపంలో కంటైనర్ల తయారీకి గమ్యస్థానమవుతుందని వెల్లడించిన మంత్రి మేకపాటి*
*చిత్తూరు జిల్లా మన్నవరంలోని ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ కు కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేయాలన్న మంత్రి గౌతమ్ రెడ్డి*
*కంటైనర్ల తయారీతో పాటు వాటి ముడిసరుకులకు అవసరమైన గిడ్డంగుల ఏర్పాటుకు కూడా సహకరించాలన్న మంత్రి మేకపాటి*
*కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్ వి.కళ్యాణరామ సహా ఉన్నతాధికారులతో మంత్రి మేకపాటి భేటీ*
*న్యూ ఢిల్లీలోని సిఓఎన్ సిఓఆర్(CONCOR) ప్రధాన కార్యాలయంలో సీఓఎన్ సీఓఆర్ సీఎండీని కలిసిన మంత్రి మేకపాటి*
*ఫిషింగ్ హార్బర్లు, లోతైన నాళాల అభివద్దిలోనూ సహకారం కోరిన మంత్రి గౌతమ్ రెడ్డి*
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్కిల్ కాలేజీలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని మంత్రి విజ్ఞప్తి*
*రామాయపట్నం పోర్టు అభివృద్ధిలోనూ భాగస్వామ్యం కోరిన మంత్రి మేకపాటి*
*మంత్రి మేకపాటి ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని ప్రాధాన్యక్రమంలో వీలైనంతగా సహకరిస్తామన్న ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కల్యాణ రామ*
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఓఎన్ సిఓఆర్ అధికారులు, ఏపీఐఐసీ ఎండీ రవీణ్ కుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, తదితరులు*
addComments
Post a Comment