కర్నూలు ఎయిర్ పోర్ట్ లో వేడుకగా ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్ ప్రారంభోత్సవ ఫంక్షన్.
ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్ కు, ప్రయాణీకులకు రెండు అత్యాధునిక ఫైర్ ఇంజన్స్ వాటర్ క్యానన్స్ తో రాయల్ సెల్యూట్ తో ఘన స్వాగతం.
బెంగళూరు నుండి కర్నూలు ఫస్ట్ ఫ్లైట్ లో విచ్చేసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు, ప్రయాణీకులకు ఘన స్వాగతం.
ఫస్ట్ ఫ్లైట్ ప్రయాణీకులను ఆప్యాయంగా పలకరించిన ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డా. ఫక్కీరప్ప.
కర్నూలు-విశాఖపట్నం తొలి ఫ్లైట్ లో వెళ్లిన ప్రయాణీకులకు పుల్లారెడ్డి స్వీట్ బాక్సులను, స్మారక పోస్టల్ కవర్లను అందించి..తొలి ఫ్లైట్ కు జాతీయ జెండా ను ఊపి ప్రారంభిచిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.
ప్రయాణీకులకు స్వీట్ బాక్సులను బహూకరించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్.
కర్నూలు లో పుట్టి పెరిగి పైలట్ అయి..కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ఫస్ట్ ప్యాసింజర్ ఇండిగో ఫ్లైట్ కు పైలట్ గా రావడం నా జీవితంలో ఒక మధురానుభూతి: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో బెంగళూరు-కర్నూలు; కర్నూలు-వైజాగ్ ఇండిగో ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్ పైలట్ వీరా ఆనందం*
కర్నూలు, మార్చి28 (ప్రజా అమరావతి): రాయలసీమ వాసులు ప్రత్యేకించి ఆంధ్రుల తొలి రాజధాని కర్నూలు జిల్లా వాసుల సొంత గడ్డ నుండి విమానయాన దశాబ్దాల కలను నిజం చేస్తూ.. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నెల 25 న ఓర్వకల్/కర్నూలు ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించి..ఎయిర్ పోర్ట్ కు తొలి స్వాతంత్ర్య సమర యోధులు, రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు ప్రకటించి వెళ్లగా....ఆదివారం నాడు మరో చరిత్రాత్మక ఘట్టాన్ని తొలి ప్యాసింజర్ ఫ్లైట్ ప్రారంభోత్సవాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో.. వేడుకగా ..పండుగ వాతావరణం లో..ఆనందోత్సవాలు, చప్పట్లు, కేరింతల నడుమ నిర్వహించారు
కర్నూలు ను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయ రాజధానిగా ప్రకటించిన అనంతరం.. కర్నూలు ఎయిర్ పోర్ట్ ను 110 కోట్ల రూపాయలతో పెండింగ్ పనులన్నింటినీ ఫైనాన్స్ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రత్యక్ష పర్యవేక్షణ లో, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ద్వారా యుద్ధ ప్రాతిపదికన పూర్తీ చేయించడం తెలిసిందే
ఆదివారం నాడు కర్నూలు ఎయిర్ పోర్ట్ లో బెంగళూరు- కర్నూలు; కర్నూలు-విశాఖపట్నం; కర్నూలు-చెన్నై; కర్నూలు-బెంగళూరు కు తొలి ప్యాసింజర్ ఫ్లైట్స్ ఆవిష్కరణ చరిత్రాత్మక ఘట్టం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో..ఆనందోత్సవాల నడుమ అద్భుతంగా జరిగింది.
బెంగళూరు నుండి కర్నూలు విమానాశ్రయానికి ఆదివారం ఉదయం 10:10 గంటలకు చేరుకున్న తొలి ప్యాసింజర్ ఇండిగో ఫ్లైట్ కు రెండు అత్యాధునిక ఫైర్ ఇంజన్స్ వాటర్ క్యానన్స్ తో రాయల్ సెల్యూట్ తో ఎయిర్ పోర్ట్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ చారిత్రాత్మక ఘట్టం..తొలి ప్యాసింజర్ ఫ్లైట్స్ (ఇండిగో) బెంగళూరు-కర్నూలు; కర్నూలు-విశాఖపట్నం ఫ్లైట్స్ కు జాతీయ జెండా ఫ్లాగ్ వేవ్ చేసి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం..ఎంపీలు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఏపీ ఎయిర్ పోర్ట్స్ డేవేలప్మెంట్ కార్పొరేషన్ ఎండి భరత్ కుమార్ రెడ్డి, ఎస్పీ డా.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా, కర్నూలు మునిసిపల్ కమీషనర్ డీకే బాలాజీ, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, డి.ఆర్.ఓ ఫుల్యాయ్ ఐ&పీఆర్ డిడి తిమ్మప్ప, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస రెడ్డి, ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా బెంగళూరు-కర్నూలు తొలి ప్యాసెంజర్ ఫ్లైట్ (ఇండిగో 6E7911) ను నడిపిన పైలట్ కర్నూలు వాసి వీరా..తొలి ప్యాసింజర్స్ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, బెంగళూరు నాగరబావి నివాసి రాంప్రసాద్ దంపతుల కూతురు సాయి ప్రతీక్ష(6 సంవత్సరాలు) లకు పూల మొక్కలను ఇచ్చి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, స్థానిక ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, ఎయిర్ పోర్ట్ అధికారులు, ఇండిగో సంస్థ అధికారులు ఘన స్వాగతం పలికి ఆప్యాయంగా ప్రయాణీకులను పలకరించి.. వారి తొలి విమాన ప్రయాణ అనుభూతిని అడిగి తెలుసుకున్నారు.
అలాగే, కర్నూలు విమానాశ్రయం నుండి విశాఖపట్నం బయలు దేరిన తొలి ప్యాసింజర్ ఫ్లైట్ (ఇండిగో 6E 7912) కు జాతీయ జెండా ఊపి ప్రారంభించి, ప్యాసింజర్స్ కు స్వీట్స్ ప్యాకేట్స్ ను బహుకరించి ..హ్యాపీ జర్నీ చెప్పిన మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. పాల్గొన్న లోకల్ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, లోకల్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఏపీ ఎయిర్ పోర్ట్స్ డేవేలప్మెంట్ కార్పొరేషన్ ఎండి భరత్ రెడ్డి, ఎస్పీ డా.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు తదితరులు
ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ మొత్తం పండుగ వాతావరణంతో..కేరింతలు, చప్పట్లతో సంతోషకర వాతావరణం నెలకొంది..చరిత్రాత్మక ఘట్టంలో తాము కూడా ప్రత్యక్ష సాక్షులుగా నిలిచామనే ఆనందం ప్రతి ఒక్కరి కళ్ళలో కనిపించింది.అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎయిర్ పోర్ట్ అధికారులు, ప్రయాణీకులు ఎయిర్ పోర్ట్ లో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్ లతో గ్రూప్ ఫోటోలు, సెల్ఫీలు దిగారు
ఈ సందర్భంగా బెంగళూరు నుండి కర్నూలు విమానాశ్రయం కు ఫస్ట్ ఫ్లైట్ నడిపిన పైలట్ వీరా కూడా కాసేపు విరామ సమయంలో రన్ వే మీదున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దగ్గరకు వచ్చి, గ్రూప్ ఫోటో దిగుతూ..మాటల మధ్యలో..తాను కూడా కర్నూలు లో పుట్టి పెరిగి పైలట్ అయి..కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ఫస్ట్ ప్యాసింజర్ ఇండిగో ఫ్లైట్ కు పైలట్ గా రావడం నా జీవితంలో ఒక మధురానుభూతిని మిగిల్చినందుకు ధన్యవాదాలని..ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో బెంగళూరు-కర్నూలు; కర్నూలు-వైజాగ్ ఇండిగో ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్ పైలట్ వీరా తన ఆనందాన్ని పంచుకున్నారు.
అలాగే, చారిత్రాత్మక ఘట్టం తొలి ప్యాసెంజర్ ఫ్లైట్స్ లో బెంగళూరు నుండి కర్నూలు ఎయిర్ పోర్ట్ కు రావడం..కర్నూలు ఎయిర్ పోర్ట్ నుండి విశాఖపట్నం బయలుదేరి వెళ్లడం..తమ జీవితాల్లో ఎన్నటికీ మారిచిపోలేని మధురానుభూతిని మిగిల్చిందని.. కర్నూలు జిల్లా వాసులుగా.. కర్నూలు ఎయిర్ పోర్ట్ నుండి విమాన ప్రయాణం కలను నిజం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఫైనాన్స్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లకు ఫస్ట్ ఫ్లైట్ కర్నూలు ప్యాసింజర్స్, కర్నూలు వాసి పైలట్ వీరా తమ ధన్యవాదాలను తెలిపారు.
ఈ సందర్భంగా కర్నూలు వాసి పైలట్ వీరా మాట్లాడుతూ నేను కమర్షియల్ ఫ్లైట్స్ పైలెట్ గా 15 సంవత్సరాల నుండి పని చేస్తున్నాను..మా పెద్దలది మహబూబ్ నగర్ జిల్లా - కర్నూలు జిల్లా బోర్డర్ శాంతి పురం. అయితే నేను పుట్టి పెరిగింది ..చదువుకున్నది కర్నూలు లోనే..పైలట్ గా ఎదిగి..నేను పుట్టి పెరిగిన కర్నూలు ఎయిర్ పోర్ట్ కు బెంగళూరు నుండి ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్ ను..కర్నూలు-విశాఖపట్నం కు ఫస్ట్ ఫ్లైట్ ను నడపడం పైలట్ గా, వ్యక్తి గతంగా నా అదృష్టం.. ఈ మధురానుభూతిని ఎప్పటికీ మరువను అని ఆర్థిక శాఖ మంత్రితో, మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు.
అంతక్రితం, ఎయిర్ పోర్ట్ టెర్మినల్ బిల్డింగు లో సాంస్కృతిక కార్యక్రమాలను, అభినందన సమావేశాన్ని నిర్వహించి..ఓర్వకల్/ కర్నూలు ఎయిర్ పోర్ట్ కు కృషి చేసిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎయిర్ పోర్ట్ డేవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి భరత్ కుమార్ రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా, కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ డీకే బాలాజీ, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, పోస్టల్ అధికారులను, జిల్లా అధికారులను, కంట్రాక్టర్లను, ఇంజనీర్లను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఘనంగా సన్మానించి మెమెంటో లను బహూకరించారు.
addComments
Post a Comment