డిజిపి కార్యలయం (ప్రజా అమరావతి);
జాతీయస్థాయిలో మరోసారి సత్తా చాటిన ఏపీ పోలీస్ శాఖ....ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నూతన ఆవిష్కరణలు, తీసుకువస్తున్న సంస్కరణలు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెక్నాలజీ వినియోగంలో మూడు జాతీయ స్థాయి సంస్థలు(SKOCH, FICCI, NCRB/MHA) దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ ను ప్రధమ మరియు ఉత్తమ రాష్ట్రంగా గుర్తించి గౌరవించడం విశేషం. ఒకే రోజు వరుసగా 13 అవార్డులను అందుకున్న ఏకైక శాఖ ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ. మొత్తం 125 జాతీయ అవార్డులను ఏపీ పోలీస్ శాఖ దక్కించుకోగా, ఈ సంవత్సరంలోనే 17 అవార్డులను అందుకోవడం గమనార్హం.
FICCI awards(Federation Of Indian Chambers Of Commerce & Industry):
స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్ స్టేట్:
ఆపత్కాల సమయంలో పౌరులకు అందించే సేవలలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు అనుబంధంగా ఉన్న అన్ని విభాగాల్లో పౌరులకు మెరుగైన సేవలు అందించడం, పోలీసుల అంతర్గతంగా పనితీరు సామర్థ్యం పెంచే దిశగా, పోలీస్ పాలనా వ్యవస్థ పూర్తిగా డిజిటలైజ్ చేయడం ద్వారా అన్ని విభాగాల్లో దేశంలోనే అత్యంత ప్రతిభ కనపరిచిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖకు ఈ అవార్డు దక్కింది.
ఇంపాక్ట్ అఫ్ టెక్నాలజీ....
దేశంలోనే తొలిసారిగా అత్యంత వేగంగా 85% కేసుల దర్యాప్తును పూర్తి చేయడం,అంతేకుండా శిక్షల శాతాన్ని పెద్దఎత్తున పెంచడంతో పాటు సాంకేతికతో కూడిన సాక్షాధారాలను కేసుల దర్యాప్తులో సేకరించడం,అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8.3 లక్షల మంది నేరస్తుల కదలికలను గుర్తించడం, అదృశ్యమైన 11,440 మంది పౌరుల ను గుర్తించడం, 38 గుర్తుతెలియని మృతదేహాల కేసులను సులువుగా ఛేదించడం, అజ్ఞాతంలో ఉన్న 980 మంది నేరస్తులను గుర్తించడం,నేరస్తుల పై నిరంతర నిఘా,ఎటువంటి రుసుము లేకుండా 87 సేవలతో కూడిన ఎపి పోలీస్ సేవ అప్లికేషన్ ను పౌరులకు నిరంతరం అందుబాటులో ఉంచడం, ఈ అప్లికేషన్ ను గౌరవ ముఖ్యమంత్రి గారు 1/10/2020 నా ప్రాంభించగా కేవలం 5,1/2 నెలల కల వ్యవధిలో 2,64,799 ఎఫ్‌ఐఆర్ లను ప్రజలు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అత్యాచారం,పోక్సో కేసులు మరియు క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ కేసులలో దర్యాప్తు సమయాన్ని గణనీయంగా తగ్గించడం జరిగింది.ఇది జాతీయ సగటు కంటే తక్కువగా ఉండడం గమనార్హం మరియు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు అనుబంధంగా ఉన్న అన్ని విభాగాల్లో పౌరులకు మెరుగైన సేవలు అందించడం,పోలీసుల అంతర్గత పనితీరు సామర్థ్యం పెంచేదిశగా,పోలీస్ పాలనా వ్యవస్థ పూర్తిగా డిజిటలైజ్ చేయడం ద్వారా అన్ని విభాగాల్లో దేశంలోనే అత్యంత ప్రతిభ కనపరిచిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖకు ఈ అవార్డు దక్కింది.
దిశా పోలీస్ స్టేషన్లు:
దిశ పోలీస్ స్టేషన్ లను మోడల్ పోలీస్ స్టేషన్లగా తీర్చిదిద్దడమే కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం జరిగింది. దీంట్లో ఒక సైబర్ expert తో పాటు ఇద్దరు కాల్ సెంటర్ ఎంప్లాయిస్ ను కూడా నియమించడం జరిగింది. 50 మంది సిబ్బందలో ఒక డి.ఎస్.పి మరియు సీఐ తో పాటు ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.దీని ద్వారా మహిళలకు సత్వర న్యాయం అందించడంతో పాటు కేసు దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయడం ఛార్జిషీట్లును న్యాయస్థానంలో దాఖలు చేయటం, సంవత్సర కాల వ్యవధిలోనే 1551 కేసులలో సత్వర చార్జిషీట్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రం లోని మహిళలు 13,00,000 మంది తమ మొబైల్ ఫోన్లలో దిశ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ‘దిశ’ అంకురార్పణ కార్యక్రమం ద్వారా మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి నేరానికి పాల్పడ్డ వారికి 21 రోజుల్లో జడ్జిమెంట్ వచ్చేవిధంగా రూపొందించడం జరిగింది. దిశ సంబంధిత కార్యక్రమాల అమలు,నిర్వహణకు ప్రభుత్వం రూ .87.125 కోట్లు రూపాయలను మంజూరు చేయడం జరిగింది. దిశ కేసు దర్యాప్తు లో అత్యంత కీలకమైన ఎఫ్.ఎస్.ఎల్ ల్యాబ్ లను ఆధునిక టెక్నాలజీ తో అప్‌గ్రేడేషన్ చేయడంతోపాటు, దిశ కేసుల విచరణలో భాగంగా ప్రతి జిల్లాలో ప్రత్యేక టీంలు, కేసు దర్యాప్తులో ఖచ్చితమైన నిర్ణీత సమయంలో ట్రైల్ పూర్తి జరిగే విధంగా చర్యలు, దిశ కేసుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు, ప్రతి జిల్లాలో దిశ కేసుల కోసం ప్రత్యేక స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది.ఇటువంటి చర్యలు చేపట్టడం ద్వారా జాతీయ స్థాయి అవార్డు లభించింది.
సైబర్ మిత్ర:
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంతర్జాలంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రవేశపెట్టిన సైబర్ మిత్ర ( వాట్సాప్ నంబర్ 9121211100)సత్ఫలితాలనిస్తుంది.సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా ఇప్పటివరకు 3082 ఫిర్యాదులను స్వీకరించగా అందులో 395 FIR లు నమోదు చేయడంతోపాటు, గత సంవస్తర కాలం లో సైబర్ క్రైమ్ లో నమోదైన కేసులలో 37% సైబర్ మిత్ర నుండి వచ్చినవే, వాటి సత్వర పరిష్కారానికి గాను జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.
కోర్ట్ బ్లేజ్:
కోర్టు బ్లేజ్ అనే అప్లికేషన్ ద్వారా సామాన్య ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా బాధితులకు సంబంధించిన కేసుల దర్యాప్తు వివరాలు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ రూపంలో వారికి చేరవేయడం అదేవిధంగా దర్యాప్తు అధికారి వివరాలు ఆయన పనితీరు వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని SMS ల ద్వారా చేరవేస్తుంది. కోర్టులలో ఈ కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి విచారణ సమయాన్ని తగ్గించడం వాటి వివరాలను సైతం సత్వరమే బాధితుడికి అందించడం సహాయపడటం ద్వారా ఈ కోర్ట్ బ్లేజ్ అప్లికేషన్ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.
స్కోచ్ అవార్డ్స్:
ఉత్తమ డిజిపి అవార్డు(POLICING & PUBLIC SAFTY):
*పోలీసింగ్ మరియు పబ్లిక్ సేఫ్టీ*.... పోలీస్ శాఖలోని అన్ని విభాగాలలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ ద్వారా పౌరులకు సత్వర సేవలు,అంతర్గత సామర్థ్యం పెంపొందించడం,పోలీస్ శాఖలో సంక్షేమ పథకాల అమలు తద్వారా పౌరులకు పారదర్శకత, జవాబుదారీతనం,సత్వర న్యాయం అందించడంలో అత్యున్నత నాయకత్వం ద్వారా పోలీస్ శాఖ లోని అన్ని విభాగాల సేవలలో ప్రతిభను పెంపొందించి ఉత్తమ సేవలను ఆంధ్రప్రదేశ్ పౌరులకి (సేఫ్టీ, సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్) అందించినందుకు మరియు పోలీసు శాఖలో పరివర్తనతో కూడిన మార్పునకు కారణమైన నాయకుడిగా దేశంలోని డీజీపీలలో ఉత్తమ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ కు ఈఅవార్డును ప్రకటించారు.
దేవాలయాల పరిరక్షణ:
భారతదేశంలో దేవాలయాల పరిరక్షణకు ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని విధంగా రక్షణ చర్యలు చేపట్టింది ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ.దేవాలయాల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కమిటీలను నియమించడం, ప్రతి ఒక్క దేవాలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు,జియో ట్యాగింగ్ తో పాటు సెక్యూరిటి ఆడిట్ చేయటం ద్వారా దేవాలయాలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తుంది.ఆలయాల భద్రతకు తీసుకొంటున్న చర్యలకు గాను జాతీయ స్థాయి అవార్డ్ లబించింది.
అమర్చబడిన సిసి కెమెరాలు: 14478 దేవాలయాలలో 48314 కెమెరాలు అమర్చడం జరిగింది.
బైండ్ ఓవర్ చేయబడిన దేవాలయ నేరగాళ్ళు & కమ్యూనల్ సస్పెక్ట్ లు: 4878
ఏర్పాటు చేయ బడిన గ్రామ రక్షక దళాలు: 19056
ఛేదించబడిన దేవాలయ నేరాలు: 206
అన్ని రకాలైన దేవాలయల సంబంధిత నేరాలలో అరెస్ట్ కాబడిన ముద్దాయిలు: 393.
WOMEN HELP DESK:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రవేశపెట్టిన దిశ అంకురార్పణ కార్యక్రమంలో భాగంమైన women హెల్ప్ డెస్క్ పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వారి కోసం పోలీస్ పెట్రోలింగ్,స్టేషన్లో మంచినీటి సౌకర్యం, విశ్రాంతి గది, విశాలమైన రిసెప్షన్ సెంటర్, నిరక్షరాస్యులైన మహిళల కోసం ఫిర్యాదు వ్రాయడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించేందుకు అనుగుణంగా శిక్షణ పొందిన మహిళా సిబ్బంది వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటారు. అంతే కాకుండా అదనంగా మహిళా మిత్ర వాలంటీర్లు కూడా తమ సేవలను అందిస్తారు తద్వారా పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధిత మహిళకు మనోధైర్యం కల్పించ డానికి వారికి మానసిక వైద్య నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించి సమస్యను వివరించేందుకు మహిళా అధికారిణీలను అందుబాటులో ఉంచడం వంటి ఏర్పాట్లను చేపట్టడం ద్వారా,మహిళలకు అందిస్తున్న విశేషమైన సేవలకు గుర్తింపుగా జాతీయ స్థాయి సిల్వర్ అవార్డును సొంతం చేసుకుంది.
సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టం:
మానవహక్కుల పరిరక్షణలో భాగంగా పౌరులకు మెరుగైన సేవలను అందించెందుకు సుప్రీం కోర్ట్ ఆదేశాలకంటే ముందే విప్లవాత్మక మైన మార్పులకు శ్రీకారం చుట్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టం లో భాగంగా మొదటి విడత పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 500 పోలీస్ స్టేషన్ లను ఎంపిక చేయడం జరిగింది.పోలీస్ స్టేషన్ లోని మహిళ మరియు పురుషులకు చెందిన లాకప్ లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సిసి కెమెరాలు పూర్తిగా నైట్ విజన్,డే విజన్ తో పాటు రెండు విధాల కమ్యూనికేషన్ వ్యవస్థగా ఈ కెమెరాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు అదేవిధంగా పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన కార్యాలయానికి రెండు విధాలుగా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు గాను గోల్డ్ అవార్డ్ లభించింది.
కోర్టు బ్లేజ్:
కోర్టుబ్లేజ్ అప్లికేషన్ రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. స్కోచ్ సంస్థ ప్రకటించిన అవార్డుల్లో సిల్వర్ అవార్డ్ దక్కించుకోగా,మరో జాతీయ సంస్థ FICCI ప్రకటించిన అవార్డులలో కూడా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.
ICJS:(ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్):ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ పాలనలో రూల్ ఆఫ్ లా ఆచరణలో అత్యంత కీలకమైన అంశం పౌరులకు సత్వర న్యాయం పారదర్శకంగా అందించే దిశగా ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టంను మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
దేశంలో రూల్ ఆఫ్ లా అమలులో ఇది అత్యంత కీలకం:
క్రిమినల్ జస్టిస్ సిస్టం లో మూల స్తంభాలైన పోలీస్ శాఖ, జైళ్ల, న్యాయస్థానాలు మరియు మహిళా& శిశు సంరక్షణ శాఖ లన్నింటిని సమన్వయపరుస్తూ ఏకతాటిపైకి తీసుకువచ్చి అవసరమైన సందర్భంలో సంబంధిత కేసు వివరాలను ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం తో ఆన్ లైన్ ద్వారా సమన్వయ పరిచే విధానం ఈ ICJS(inter-operable criminal justice system)సిస్టం. ICJS విధానం ద్వారా ప్రతి ఒక్క పిల్లర్ కు సంభందించిన డాటా మిగిలిన పిల్లర్లకు చేరుతుంది అంతే కాకుండా ప్రతిఒక్క పిల్లర్ మిగిలిన పిల్లర్ల నుండి డాటా ను తిసుకుంటుంది. భాధితులకు సత్వర న్యాయం అందించేందుకు పూర్తి స్థాయిలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాసిక్యూషన్ వేగవంతం చేయడం ద్వారా సమయం ఎంతగానో ఆదా అవుతుంది. ఐ సి జె ఎస్ విధానంతో పౌరులకు అందిస్తున్న ఉత్తమైన సేవలలో రెండవ స్థానం నుండి మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈ విభాగనికి అవార్డును సొంతం చేసుకుంది(NCRB-MHA).
ఈ సంధర్భంగా గౌరవ డిజిపి గారు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతుందని ఇప్పటికే జాతీయ స్థాయిలో 14 నెలల కాలంలో 125 అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సొంతం చేసుకోగా కేవలం రెండు నెలల వ్యవధిలో 17 జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకుంది. ఏ టెక్నాలజీ వాడినా ఆ ఫలాలను ప్రజలకు క్షేత్రస్థాయిలోఅందించి వారికి సత్వర న్యాయం చేకూర్చినప్పుడే అది అర్థవంతం అవుతుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇప్పటివరకు చేసిన మరియు చేస్తున్న కృషి నాకు ఎంతగానో సంతృప్తినిచ్చింది.ఈ విజయం వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిరంతర సూచనలు, సలహాలు, దిశా నిర్దేశం, వెన్నుతట్టి ప్రోత్స హించడం ఎంతగానో తోడ్పాటుని అందించింది .ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి గారికి పోలీస్ శాఖ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం ఏ ఒక్కరితోనూ సాధ్యమయ్యేది కాదు. క్షేత్ర స్థాయి సిబ్బంధి నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ నిరంతరం శక్తివంచన లేకుండా చేస్తున్న కృషికి ప్రతిఫలం ఈ జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ దక్కించుకున్న గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని సగర్వంగా నేను తెలియజేస్తున్నాను.
ఈ సంధర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వైస్.జగన్ మోహన్ రెడ్డిగారు మాట్లాడుతూ రాష్ట్రం లోని ప్రజలకు సామాజిక న్యాయం, ముఖ్యంగా మహిళలు ,చిన్నారులు, సమాజంలో అత్యంత వెకబడిన వర్గాలకు చెందిన వారికి చేరుకునే విధంగా, వారికి మెరుగైన భద్రత కల్పిస్తున్నాము అనే బరోసా కల్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖలో గతంలో ఎన్నడు లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో తీసుకువస్తున్న సమూలమైన మార్పులు, సిబ్బంది లోని జబాబుదారీతనం ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా వస్తున్న మార్పులు, దేశంలో ఎక్కడ లేనివిధంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అత్యంత ఆధునిక టెక్నాలజీ ని వినియోగించడమే కాకుండా క్షేత్రస్థాయిలో దాని ఫలాలు రాష్ట్రం లోని ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తూ నిరంతరం ప్రజా రక్షణకు పాటుపడుతున్న పోలీసు శాఖను నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
addComments
Post a Comment