ఉపాధ్యాయ ఎంఎల్సి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

 ఉపాధ్యాయ ఎంఎల్సి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి


*మొత్తం 30వేల 927 మంది ఓటర్లు,227 పోలింగ్ కేంద్రాలు


ఉ.8గం.ల నుండి సా.4గం.ల వరకూ పోలింగ్.


మావోయిస్టు ప్రభావిత రంపచోడవరం,ఎటపాక,కుక్కునూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలో ఈ.8గం.ల నుండి మ.2గం.ల వరకే పోలింగ్.


*2వేల 200 మంది పోలింగ్ సిబ్బంది.

*2వేల 400 మంది పోలీస్ సిబ్బంది.


కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు.


రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి  కె.విజయానంద్.


అమరావతి (ప్రజా అమరావతి),13 మార్చి : ఈనెల 14న జరిగే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి 2 ఉపాధ్యాయ ఎంఎల్సి స్థానాల ఎన్నికల నిర్వహణకు ఆయా జిల్లా యంత్రాంగాలు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాల్లో మొత్తం 30మంది అభ్యర్థులు పోటీలో ఉండగా మొత్తం 30వేల 927మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని సిఇఒ పేర్కొన్నారు. మొత్తం 227 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ నిర్వాహణకు 2వేల 200 మంది పోలింగ్ సిబ్బందిని, బందోబస్తు నిర్వహణకు 2వేల 400 మంది పోలీస్ సిబ్బందిని నియమించామని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు రెండు నియోజకవర్గాల్లో ఒక్కో ఎన్నికల పరిశీలకుని నియమించడం జరిగిందని సిఇఒ తెలిపారు.అలాగే ఆయా పోలింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు ఏవిధంగా అమలు చేస్తున్నారనేది పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో ఒక సీనియర్ అధికారిని నియమించడం జరిగిందని సిఇఒ విజయానంద్ పేర్కొన్నారు.


ఎమెఎల్సీ ఎన్నికల పోలింగ్ 14వతేది ఈ.8గం.ల నుండి సాయంత్రం 4గం.ల వరకూ జరుగుతుందని సిఇఒ తెలిపారు.కాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన రంపచోడవరం, ఎటపాక, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలో నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఈ.8గం.ల నుండి మధ్యాహ్నం 2గం.ల వరకూ మాత్రమే పోలింగ్ జరుగుతుందని విజయానంద్ స్పష్టం చేశారు. పోలింగ్

 కేంద్రాల్లో ఇచ్చే వయొలెట్ రంగు స్కెచ్ పెన్ తో మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ స్పష్టం చేశారు.


కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడమైందని సిఇఒ తెలిపారు. అనగా సిబ్బందికి మాస్క్,గ్లౌజులు వంటివి సమకూర్చడం తోపాటు సానిటైజర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు.


ఉపాధ్యాయ ఎమెఎల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉన్నవారందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ ఉపాధ్యాయ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.