మహిళలు అన్నిరంగాల్లో లక్ష్యాలవైపు దూసుకుపోవాలి.....
- సభాపతి తమ్మినేని సీతారామ్
- సృష్టికి మూలం అమ్మ.... మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి
- అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్
అమరావతి (ప్రజా అమరావతి),మార్చి8 : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, లక్ష్యాల వైపు దూసుకుపోవాలని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారామ్ పిలుపు నిచ్చారు. అసెంబ్లీ కమిటి సమావేశ మందిరంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి పి. బాలకృష్ణమాచార్యులు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సభాపతి మాట్లాడుతూ సృష్టికి మూలం అమ్మ అటువంటి అమ్మను పూజించడం మన భారతీయ సంసృతి, సంప్రదాయమన్నారు, మహిళలు వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో రాణించాలని పిలుపు నిచ్చారు.మహిళలపై తమకున్న గౌరవాన్ని చాటిచెప్పేలా రెండు రోజుల్లో వారికి ప్రత్యేక ఆర్ధిక సాయం చేస్తామని స్పీకర్ తమ్మినేని వెల్లడించారు.మగవారితో సమానంగా మహిళలు పని చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మహిళా మహనీయులు రాణీ రుద్రమదేవి, ఝాన్సీలక్ష్మీభాయి, సరోజనీ నాయుడు, ఇందిరా గాంధీలు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అసెంబ్లీలో అత్త్యున్నత సేవలను అందించిన మహిళా అధికారిణిలు శకుంతల, సాయిలక్ష్మీలను శాలువాలతో సత్కరించి,మెమంటోలను అందజేశారు.మహిళలు తెచ్చిన ప్రత్యేక కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, మహిళా కార్యదర్శులు,ఉద్యోగినులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment