కోవిడ్ వ్యాక్సిన్ తో ఇంటి పండుగలు జరుపుకోండి
డాక్టర్ బూసి రెడ్డి నరేందర్ రెడ్డి
వ్యాక్సిన్ తర్వాతే పెళ్లి.. కాబోయే వధూ వరులు
గుంటూరు (ప్రజా అమరావతి);
గృహాల్లో జరుపుకొనే ప్రతి పండుగను కోవిడ్ వ్యాక్సిన్తో నిర్వహించుకునే లా ప్రజలంతా ముందుకు రావాలని సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసి రెడ్డి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పుట్టిన రోజులు, వివాహాలు, షష్టిపూర్తి వంటి ఇంటి పండుగలు జరుపుకునే రోజునే కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని నిర్వహించుకున్న ట్లయితే జీవితాంతం ఓ గుర్తుగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రెండో దశలో కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో 45 సంవత్సరాలు దాటిన ప్రతివారు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఇటీవల ఎంగేజ్మెంట్ జరుపుకున్న కాబోయే వధూవరులు తమ పెళ్లి నాటికి జీరో కరోనా వైరస్ సాధించాలన్న నిశ్చయంతో శనివారం తమ బంధువులకు దగ్గరుండి వ్యాక్సిన్ వేయించారు. సత్తెనపల్లి కి చెందిన త్రిపురమల్లు గోకుల్, విజయవాడకు చెందిన కొత్త భవ్య లు సాయిభాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో తమ తల్లిదండ్రులకు, బంధువులకు వ్యాక్సిన్ను వేయించారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న ది కేవలం అపోహ మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం మన జిల్లాలో ఇప్పటివరకు 1.20 లక్షల మందికి వ్యాక్సిన్ వవేయగా కేవలం 0.05 శాతం మాత్రమే చిన్నపాటి ఇబ్బందులకు గురయ్యారు అన్నారు. ఎక్కడో ఏదో జరిగిందని ఆందోళన చెందుతూ వ్యాక్సిన్ కు దూరంగా ఉండడం సమంజసం కాదని తెలిపారు. కరోనా మహమ్మారిని నియంత్రించాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఆదివారం నుంచి గుంటూరు నగరంలో అన్ని వాకింగ్ ట్రాక్ల లో వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జర్నలిస్ట్ కుటుంబాల వారికి, తెల్లకార్డు ఉన్న నిరుపేదలకు గుంటూరు సాయి భాస్కర్ హాస్పిటల్ లో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ బూసి రెడ్డి నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు
అంతకుముందు గుంటూరు ఆర్డీవో భాస్కర్ రెడ్డి, డి.ఎస్.పి సీతారామయ్య, కొత్తపేట సిఐ రాజశేఖర్ రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొని కోవిడ్ను నియంత్రించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యరగూటి సాంబశివారెడ్డి, డాక్టర్ కిరణ్, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment