నిత్యం ప్రజలు మధ్యలో ఉంటూ వారి సమస్యలు పరిష్కారం చేస్తున్న మంత్రి ఆళ్ల నాని గారు...

 పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు (ప్రజా అమరావతి);




మధ్య వర్తులు ప్రమేయం అవసరం లేదు...


నేరుగా కలిసి తమ సమస్యలు చేప్పుకోవచ్చు...


ప్రజలు వెంట... ప్రతి నిత్యం ప్రజలతోనే...


నిత్యం ప్రజలు మధ్యలో ఉంటూ వారి సమస్యలు పరిష్కారం చేస్తున్న మంత్రి ఆళ్ల నాని గారు...


అక్కడికక్కడే వినతులు పరిష్కారం...




ఏలూరు ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకి రెండవ రోజు భారీగా వచ్చిన పిర్యాదు దారులు...



మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో డెప్యూటేషన్,నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఎంతో కాలంగా పరిష్కారం కానీ పలు సమస్యలను పిర్యాదు దారులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకువచ్చారు...


వారి సమస్యలను సావధానంగా విని అక్కడికక్కడే సంబందించిన అధికారులతో ఫోన్ లో మాట్లాడి తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని మంత్రి ఆళ్ల నాని అదేశాలు ఇచ్చారు...



పిర్యాదు దారులు గోడు విన్న మంత్రి ఆళ్ల నాని సిపారసు చేస్తూ సంబందించిన అధికారులకు పంపించడంతో అక్కడకి వచ్చిన పిర్యాదు దారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి ఆళ్ల నానికి కృతజ్ఞతలు తెలిపారు...


జిల్లాలోని పలు ప్రాంతాల నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి కూడ ప్రజలు మంత్రి ఆళ్ల నానిని నేరుగా కలిసి తమ ఇబ్బందులు చేప్పుకున్నారు...


ఎలాంటి రికమండేషన్స్ లేకుండా, మధ్య వర్తులు లేకుండా ఎవరు వచ్చిన స్వయంగా మంత్రి ఆళ్ల నానిని కలిసి సమస్యలు చేప్పుకుంటున్నారు...


క్యాంపు ఆఫీస్ వద్ద ప్రజలు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్ లో కుర్చీలో ఆశీనులలైన పిర్యాదు దారుల వద్దకు వెళ్లి వారితో ఆప్యాయంగా మాట్లాడి...


బాగున్నారా... అందరిని అడిగినట్టు చేప్పండి అని భుజం తట్టి మంత్రి ఆళ్ల నాని ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు...


దీంతో పిర్యాదు దారులు సంతృప్తితో వెను తిరుగుతున్నారు...


మంత్రి ఆళ్ల నాని తమ పట్ల ఎంతో ఆప్యాయంగా వ్యవహరించిన తీరుతో పిర్యాదు దారులతో పాటు, ప్రజలు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు...



కొంతమంది మంత్రి ఆళ్ల నాని అదేషాలతో ఉద్యోగ అవకాశాలు రావడంతో స్వయంగా వచ్చి మంత్రి ఆళ్ల నానిని కలిసి పుష్ప గుచ్చం అంద చేసి పలువురు ధన్యవాదములు తెలుపుతున్నారు...



Comments