మాదకద్రవ్యాలకు యువత బానిస కావద్దు-యువత సత్ప్రవర్తనతో మెలిగినప్పుడే సమాజం బాగుంటుంది.

జంగారెడ్డి గూడెం (ప్రజా అమరావతి);


మాదకద్రవ్యాలకు యువత బానిస కావద్దు-యువత సత్ప్రవర్తనతో మెలిగినప్పుడే సమాజం బాగుంటుంది.పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి శ్రీ కె నారాయణ్ నాయక్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై జంగారెడ్డి గూడెం డిఎస్పీ డాక్టర్ రవికిరణ్  గారు మాదకద్రవ్యాల నిరోధం పై విద్యా వికాస్ కాలేజీ లో విద్యార్థులకు  అవగాహన సదస్సును నిర్వహించినారు.


మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా నైతిక విలువలతో కూడిన నవ సమాజ నిర్మాణానికి యువత కృషి చేయాలని జంగారెడ్డి గూడెం డిఎస్పీ గారు పేర్కొన్నారు. ఈ  రోజు జంగారెడ్డి గూడెం విద్యా సంస్థ కళాశాలలో

మాదకద్రవ్యాల నిరోధంపై జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి  జంగారెడ్డి గూడెం డిఎస్పీ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా డిఎస్పీ గారుమాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలు,కొన్ని నియమాలకు లోబడి ఉండాలి అని సూచించారు. మానవ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందన్నారు.

విచ్చలవిడి తనానికి అలవాడు పడి మాదకద్రవ్యాలకు బానిసలవుతున్న యువత మేల్కొని వారి జీవితాలను చక్క దిద్దికోకపోతే అదే మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతారు అని అన్నారు.మొదట్లో సరదాగా తీసుకునే ఈ మత్తపదార్థాలు ఆ తరువాత నియంత్రణ కోల్పోయి  మత్తుకు బానిసలుగా మారిపోతుంటారని అన్నారు.అది నేర ప్రవృత్తివైపు కూడా ప్రేరేపిస్తుందని చెప్పారు. మాదక ద్రవ్యాలు విక్రయించి సొమ్ము చేసుకుందామని  ఎవరైనా భ్రమ పడి అమాయక యువకులు, విద్యార్థులను ప్రలోభపెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా కాలేజీలకు వెళ్తున్న విద్యార్థులపై తల్లిదండ్రులు ప్రేత్యక శ్రద్ద తీసుకోని వారిని సన్మార్గంలో నడిపించాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో అవగాహన లోపంతో ఎక్కువ శాతం యువత ఈ మాదకద్రవ్యాలకు అలవాటు పడి వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనంచేసుకుంటున్నారని అన్నారు. చదువుకున్న వయసులో యువత చెడు వ్యసనాలకు గురి కాకుండా క్రమశిక్షణతో ఉండి మంచి ఆశయాలతో భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరారు. మనల్ని ప్రభావితం చేసే పరిసరాల ప్రభావాలను మనకు మనమే నియంత్రించుకోని,మన చుట్టుపక్కల వారిని కూడా అవగాహన చేస్తు ఎటువంటి దురలవాట్లకు బానిసలు కాకుండా కాపాడాలని సూచించారు. సమాజంలో మంచి, చెడులను ఆలోచిస్తూ బంగారు భవిష్యత్తుకు యువత బాటలు వేసుకోవాలని డిఎస్పీ గారు చెప్పారు.స్వలాభంతో కొందరు మాదక ద్రవ్యాలను విక్రయించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు విచ్ఛిన్నమవుతున్నదన్నారు.విద్యార్ధులనే లక్ష్యంగా చేసుకొని పాఠశాలలు, కళాశాలల వద్ద విచ్చలవిడిగా గంజాయి, తదితర మాదక ద్రవ్యాలను విక్రయించడం దారుణమన్నారు. మాదక ద్రవ్యాలను విక్రయిస్తుండగా పట్టుబడిన వారిని కఠినంగా శిక్షిస్తున్నామని డిఎస్పీ గారు తెలిపారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతి అంశాన్ని చాలెంజ్ గా తీసుకుని భవిష్యత్తులో ,ఉన్నత స్థాయికి ఎదగాల్సిన యువత అవగాహనతో అభివృద్ధి వైపు నడవాలన్నారు. పరిపక్వమైన ఆలోచనలతో విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఈ సందర్భంగా డిఎస్పీ గారు ఆకాంక్షించారు. మాదక ద్రవ్యాలు నియంత్రణకై గౌరవ రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు అదేశాలు మేరకు ప్రజలను జాగృతి చేస్తు,విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డిఎస్పీ గారు వివరించారు. మత్తు పానియాలకు యువత ఆకర్షితులై వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంపై మద్యపానం దుష్పరిణామాలకు దారితీస్తుందని వివరించారు. మద్యానికి బానిసలు కాకుండా ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం వుందన్నారు. విద్యార్థులు బాగుంటేనే సమాజం బాగుంటుందని తెలిపారు.  యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు సమాజంపై వుందని  చెప్పారు. మద్యపానానికి బానిసలైన కుటుంబాలలోనే బాలలు అధికంగా వున్నారని తెలిపారు. మద్యంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నాయని డిఎస్పీ గారు ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో జంగారెడ్డి గూడెం సిఐ గౌరీ శంకర్ గారు, జంగారెడ్డిగూడెం ఎస్. ఐ కుటుంబరావు గారు, విద్యా వికాస్  కాలేజీ  విద్యార్దులు మరియు పోలీస్ సిబ్బంది హాజరైనారు.