అమరావతి (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన నాబార్డు ఛైర్మన్ జి.ఆర్.చింతల.
*నాబార్డు ఆర్థిక సహాయంతో జరుగుతున్న కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష*
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు కింద జరుగుతున్న పనులను నాబార్డు ఛైర్మన్‌కు వివరించిన విద్యాశాఖ అధికారులు
స్కూళ్లలో కల్పించిన 10 రకాల సదుపాయాలను వివరించిన అధికారులు
తొలివిడతలో నాడు నేడు కింద స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకోసం నాబార్డు రూ.652 కోట్లు రూపాయలు ఇచ్చింది
మిగిలిన వాటిలో కూడా నాడు–నేడు కింద పనులకోసం మరో రూ.2వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా నాబార్డు ఛైర్మన్‌ను కోరిన విద్యాశాఖ అధికారులు
వైయస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్‌పేరుతో అంగన్‌వాడీల్లో చేపడుతున్న కార్యక్రమాలను నాబార్డు ఛైర్మన్‌కు వివరించిన అధికారులు
ప్రజారోగ్య రంగంలో చేపడుతున్న నాడు – నేడు కార్యక్రమాలపై నాబార్డు ఛైర్మన్‌కు వివరాలు అందించిన వైద్య – ఆరోగ్యశాఖ అధికారులు
కొత్తగా 16 మెడికల్‌కాలేజీలను, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని వివరించిన అధికారులు
తగిన విధంగా రుణ సహాయం అందించాలని కోరిన అధికారులు
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఆర్బీకేలు, మల్టీపర్సస్ సెంటర్లు, ఫుడ్‌ప్రాసెసింగ్ విధానాలు, జనతాబజార్లను తీసుకొస్తున్నామని వెల్లడించిన వ్యవసాయ శాఖ అధికారులు
ప్రజలకు రక్షిత తాగునీటిని అందించడానికి చేపట్టిన వాటర్‌గ్రిడ్‌ప్రాజెక్టుపై వివరాలందించిన అధికారులు
రాష్ట్రంలో చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టుల వివరాలు అందించిన అధికారులు
సీఎం గారితో అనేక అంశాలపైన చర్చించాను: నాబార్డు ఛైర్మన్ జి.ఆర్.చింతల.
జగన్‌మోహన్‌రెడ్డిగారు నవరత్నాల ముఖ్యమంత్రి: నాబార్డు ఛైర్మన్
కీలక రంగాల్లో మార్పులు తీసుకురావాలని సీఎం తపనతో ఉన్నారు:
వచ్చే 15 ఏళ్లలో రాష్ట్రం పూర్తిగా మారబోతోంది:
మంచి చదువు, మంచి ఆరోగ్యం ప్రజలకు అందుతాయి:
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై మేం చాలా ఆసక్తిగా ఉన్నాం:
రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులు బాగున్నాయి:
వీటిపై పరిశీలన చేసి అన్నిరకాలుగా సహాయసహకారాలు అందిస్తాం:
ఫుడ్ ప్రాసెసింగ్‌చాలా ముఖ్యమైన రంగం:
వ్యవసాయాన్ని లాభసాటిగామార్చాల్సిన అవసరం ఉంది:
ఈ రంగంలో మేం ఏరకంగా సహాయపడగలమో ఆలోచనలు చేస్తాం:
తాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం:
నాబార్డు ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి ఉండడం గర్వకారణం: సీఎం శ్రీ వైయస్.జగన్.
ఈ కార్యక్రమంలో నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ జి. ఆర్. చింతలను సన్మానించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్.
సమీక్షకు హాజరైన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, సహకార శాఖ స్పెషల్ సెక్రటరీ వై. మధుసూదన్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, ఇతర ఉన్నతాధికారులు.
addComments
Post a Comment