డిజిపి కార్యాలయం (ప్రజా అమరావతి);
ఆంధ్ర ప్రదేశ్ పోలీసుశాఖ ఒకే రోజు వరుసగా వివిధ జాతీయ స్థాయి సంస్థల నుండి కీలక అవార్డులను అందుకుంది.
స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్* కు దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శనకుగాను ప్రతిష్టాత్మకమైన *FICCI ఉత్తమ స్టేట్ అవార్డ్* దక్కించుకున్న ఎపి పోలీస్ శాఖ. ఈరోజు ఉదయం అందజేసిన FICCI సంస్థ.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పోలీసు శాఖలో అనేక విభాగాల్లో సాంకేతిక సంస్కరణలు చేపట్టి పోలీసింగ్ మరియ పబ్లిక్ సేఫ్టీలో సమర్థవంతమైన ప్రతిభను కనబర్చిన దేశ డిజిపిలలో ఉత్తమ డిజిపిగా అవార్డు దక్కించుకున్న ఆంధ్ర ప్రదేశ్ డిజిపి శ్రీ.గౌతం సవాంగ్ IPS.
ICJS (ఇంటెరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం)లోని అన్ని మూల స్తంభాలను అనుసంధానిoచడంలో అత్యున్నత ప్రతిభ కనపరిచి దేశంలో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసుశాఖ.
వర్చువల్ విధానం ద్వారా అవార్డును అందుకున్న శ్రీ.గౌతం సవాంగ్ IPS. దేశంలోనే ఒకే రోజులో మూడు జాతీయ స్థాయి సంస్థల(skoch, Ficci, NCRB) నుండి అవార్డులను అందుకున్న ఏకైన శాఖ ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ.
ఈ అవార్డులు అందుకోవడం చాలా గర్వకారణం మరియు గౌరవం ప్రథం.ప్రజా సేవలో మరింత మమేకమై ముందుకు సాగుతాం. డిజిపి శ్రీ. గౌతం సవాంగ్ IPS..
అభినందించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత.
addComments
Post a Comment