కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఏపి డిజిపి గౌతం సవాంగ్ IPS.

 ఏపీ డి‌జి‌పి కార్యాలయం (ప్రజా అమరావతి);


కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న  ఏపి  డిజిపి  గౌతం సవాంగ్ IPS.



ఎన్నికల కోసం తమ ప్రాణాల కంటే ప్రజాసామ్య పరిరక్షణే ద్యేయంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్న పోలీసులు.


పంచాయితీ ఎన్నికల అనంతరం మున్సిపాలిటీ ఎన్నికల మద్య  స్వల్ప సమయంలో మొదటి డోస్ వాక్సినేషన్ 90% శాతం మందికి  పూర్తి చేశాం.


వ్యాక్సినేషన్ వేసుకొని నగర, పుర పోరు ఎన్నికల్లో విధులు నిర్వహించిన పోలీసులు.


ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో పోలీస్ క్లినిక్ లో వ్యాక్సిన్ తీసుకున్న డిజిపి  గౌతం సవాంగ్ IPS.


ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ స్తంభింపజేసిన సమయంలో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఏ ఒక్క పోలీస్ కూడా డ్యూటీ నుండి తప్పించుకోకుండా పగలనక, రేయనక, ఎండనక, వాననక, ప్రజారోగ్యం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం అహోరాత్రం శ్రమించి  తమ ప్రాణాలను, కుటుంబలను   సైతం లెక్కించక, ప్రజారోగ్యం, ప్రజల బద్రత కు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ  విధులను నిర్వహించిన  పోలీసు సిబ్బంది యొక్క త్యాగం మాటలకందనిది.


ఈ క్రమంలో కరోనా వ్యాప్తి కట్టడికి మనం ముందుండి సాగించిన  పోరాటంలో 110 మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారు.ప్రజల రక్షణ కోసం వారు చేసిన త్యాగాలు  ఎన్నటికీ మరువలేనివి ఆ మహనీయులకు మన సెల్యూట్.  


వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ,అదే సమయంలో  స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చాయి.ఇటువంటి క్లిష్ట సమయంలో పోలీసులు తమ ప్రాణ రక్షణ కంటే ప్రజాస్వామ్య పరిరక్షణకు మొదటి  ప్రాధాన్యతనిస్తూ “Democracy first-self care next” అనే నినాదంతో   వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్యాగం చేశారు.


కోవిడ్ సమయంలో  ప్రజలు నిత్యం పూజించే దేవాలయాలు సైతం మూసుకున్న తరుణంలో  పోలీస్‌ స్టేషన్లు, పోలీసులు మాత్రం ప్రజల ధన, మాన,ప్రాణ రక్షణే కింకర్తవ్యంగా, ఇదొక మహా భగవత్‌ పవిత్ర కార్యంగా భావించి అత్యుత్తమ సేవలు అందించారు. రాజ్యాంగం పట్ల గౌరవంతో విది నిర్వహణలో మీరు చూపిన అంకితభావానికి మరియు ఈ కఠిన సమయంలో మన వెన్నంటి ఉండి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తున్నాను.


 మిగిలిన సిబ్బంది వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయించుకోవాలి.


ప్రజలు వ్యాక్సిన్ పై అపోహలు విడనాడి,ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి.


 భారతదేశం ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా ప్రజలకు వ్యాక్సినేషన్ ని అందుబాటులోకి తీసుకురావడం మనమంతా గర్వించదగ్గ విషయం.



Comments