పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు. (ప్రజా అమరావతీ);
నిర్లక్ష్య ధోరణి తో వ్యవహరించిన 108 అంబులెన్స్ సిబ్బంది పై వేటు"..
ఆరున్నర నిమిషాలు ఆలస్యం చేసిన అంబులెన్స్ సిబ్బంది విశ్వనాథ్, భార్గవి లపై సస్పెన్షన్...
ఏలూరు 108 అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంతో క్షతగాత్రుడు మృతిపై రాష్ట ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్...
ఏలూరు వంగాయా గూడెం రోడ్ లో ,రోడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుబ్బయ ప్రాణాన్ని కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేసిన మంత్రి ఆళ్ల నాని...
సకాలంలో 108 అంబులెన్స్ వెళ్ళాక పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి ఆళ్ల నాని..
సకాలంలో 108 అంబులెన్స్ ఘటనా ప్రాంతానికి సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్య ధోరణిని తప్పు పట్టిన మంత్రి ఆళ్ల నాని..
ఈ వ్యవహారంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంలో 108 అంబులెన్స్ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లికార్జున్ ను ఫోన్లో ఆదేశించిన మంత్రి ఆళ్ల నాని..
108 అంబులెన్సు ఆలస్యం కావడం వల్ల క్షతగాత్రుడు సుబ్బయ్యకు వైద్యం సకాలంలో అందకపోవడం పై పూర్తి విచారణ చేయాలని ఆరోగ్యశ్రీ సీఈఓ ను ఆదేశించిన మంత్రి ఆళ్ల నాని..
ఘటన ప్రాంతం నుండి ఫోన్ కాల్ వెళ్ళినప్పుడు మంగళగిరిలో ఉన్న 108 కాల్ సెంటర్ నిర్వాహకుడు విశ్వనాథ్ నిర్లక్ష్యంతో సకాలంలో అంబులెన్సు వెళ్లలేదని గుర్తించిన ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున్ ఈ పూర్తీ నిర్లక్ష్య ధోరణి డిస్పాచ్ ఆఫీసర్ విశ్వనాథ్,అంబులెన్స్ ఎమరగన్సీ మెడికల్ టెక్నీషియన్ జి భార్గవి లను సస్పెండ్ చేసిన ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున్..
క్షత్ర గాత్రుడు సుబ్బయ్య ను అంబులెన్స్ లో విజయవాడ తరిలిస్తున్న సమయంలొ అదించవలసిన వైద్యం అందించాపోవడం వల్ల భార్గవి పై సస్పెన్షన్ వేటు..
కేవలం 20 నిమిషాలలో 108 అంబులెన్స్ వెళ్ళవలసి ఉండగా 10 నిమిషాలు ఆలస్యంగా ఘటన ప్రాంతనికి అంబులెన్స్ వెళ్లిందని గుర్తించిన ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లికార్జున్...
ఇక పై 108 అంబులెన్స్ లు సకాలంలో ప్రమాద ప్రాంతానికి వెళ్లకపోతే సిబ్బంది పై కఠినంగా వ్యవరిస్తనాన్న మంత్రి ఆళ్ల నాని..
మంగళగిరి లో ఉన్న 108 కాల్ సెంటర్ సిబ్బంది కి ఫోన్ కాల్ వచ్చినా వెంటనే స్పందించకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటనన్న మంత్రి ఆళ్ల నాని..
addComments
Post a Comment