ఈ నెల 12 నుంచి గ్రామ/వార్డు వలంటీర్ల సేవకు సత్కారం

 ఈ నెల 12 నుంచి గ్రామ/వార్డు వలంటీర్ల సేవకు సత్కారం :-* *మూడు కేటగిరీల కింద అవార్డుల ప్రదానం :-* *నగదుతో పాటు ప్రశంసాపత్రం, సత్కారం  జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రామ సుందర్ రెడ్డి : కర్నూలు, ఏప్రిల్ 11(prajaamaravati) : నిస్వార్థంగా నవరత్నాల పథకాలు, ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో నవరత్నాల ప్రయోజనాలు అందరికీ అందేలా కృషి చేస్తున్న గ్రామ/వార్డు వలంటీర్ల సేవలను గుర్తించి, ప్రోత్సహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక రోజు వలింటర్ సేవలకు సత్కార కార్యక్రమం పండగ వాతావరణంలా నిర్వహించనున్నామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ద్వారా పేర్కొన్నారు.* *సంక్షేమ ఫలాలు కుల, మత, వర్గ భేదాలు లేకుండా అర్హులందరి ఇంటి ముంగిటకే తీసుకెళుతున్న వలంటీర్ల సేవలకు పురస్కారాలు ప్రదానం చేయనున్నామన్నారు. గ్రామ/వార్డు వలంటీర్ లను సన్మానించడంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలను అందజేయనున్నామన్నారు. పథకాల అమలులో సమర్థత ఆధారంగా...గ్రామ/వార్డు వలంటీర్ గా పనిచేస్తూ ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ, పింఛను కార్డు, రైస్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం ఆన్లైన్, ఆఫ్ లైన్ సేవలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వలంటీర్లకు సేవా వజ్ర, రత్న, మిత్ర అవార్డును అందజేయనుమన్నారు.* *ఈ నెల 12వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఒక్కొక్క రోజు ఒక్కో నియోజకవర్గంలో వలంటీర్లు సేవలు సత్కారం కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. వలంటీర్లును నాలుగు కేటగిరీలుగా వలంటీర్ వజ్ర సేవలకు శాలువ, గోల్డ్ మెడల్, సర్టిఫికెట్, బ్యాడ్జి 30 వేల రూపాయలు, వలంటీర్ రత్న శాలువ, రత్న గోల్డ్ మెడల్, సర్టిఫికెట్, బ్యాడ్జి 20 వేల రూపాయలు, వలంటీర్ మిత్ర సర్టిఫికెట్, బ్యాడ్జి ₹10000, జనరల్ వలంటీర్ ల సేవలకు గుర్తింపుగా ను బ్యాడ్జిలను అందజేయడం జరుగుతుందన్నారు.

Comments