కోవిడ్‌ -19 పై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

కోవిడ్‌ -19 పై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.



అమరావతి (prajaamaravathi): రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌* *కోవిడ్‌ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, వాక్సినేషన్‌పై చర్చ* *పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌* *ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ ముగిశాక అధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష* కేంద్రం చెప్పిన విధంగా ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకూ చేపట్టనున్న టీకా ఉత్సవ్‌ సమయంలో రోజుకు కనీసం 6 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా చూడాలన్న సీఎం ఆ నాలుగు రోజులు కనీసంగా 24 లక్షలమందికి వాక్సిన్‌ ఇచ్చేలా కార్యాచరణ చేయాలన్న సీఎం ఈమేరకు వ్యాక్సిన్‌ డోసులు కేంద్రాన్ని కోరాలని అధికారులను ఆదేశించిన సీఎం ఈమేరకు కేంద్రంలోని అధికారులతో సమన్వయం చేసుకోవాలన్న సీఎం ఎన్నికలు ముగిసినందున వ్యాక్సిన్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్న సీఎం దీనికోసం అన్నిరకాలుగా సిద్ధం కావాలని అధికారులకు స్పష్టం చేసిన సీఎం దీన్ని విజయవంతంగా చేశాక మరిన్ని డోసులు తెప్పించుకోవడంపై దృష్టిపెట్టాలన్న సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ -19 మేనేజిమెంట్ అండ్ వాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

Comments