కోవిడ్‌–19 నియంత్రణ నివారణపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష

. అమరావతి (prajaamaravathi);  కోవిడ్‌–19 నియంత్రణ నివారణపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష


: నేటి (20వ తేదీ మంగళవారం) నుంచే 9వ తరగతి వరకు స్కూళ్లు బంద్‌ ఆ మేరకు హాస్టళ్లు, కోచింగ్‌ సెంటర్లకు కూడా సెలవు యథావిథిగా 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, పరీక్షల నిర్వహణ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి మాస్కు లేకపోతే రూ.100 ఫైన్‌ కోవిడ్‌–19పై ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి అమరావతి: కోవిడ్‌–19 నియంత్రణ, నివారణపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. సమీక్షలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..: – కోవిడ్‌ వేగంగా వ్యాపిస్తున్నందువల్ల తక్షణమే 1 నుంచి 9 వ తరగతి వరకు స్కూళ్లు, హాస్టళ్లు, కోచింగ్‌ సెంటర్ల మూసివేత. – యథావిథిగా 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ. – జూనియర్‌ కాలేజీల హాస్టళ్లు కూడా వార్షిక పరీక్షల వరకే కంటిన్యూ. – ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి. లేకపోతే రూ.100 ఫైన్‌ – 104 కాల్‌ సెంటర్‌ను ఇంకా పాపులర్‌ చేయాలి. – కోవిడ్‌ సమస్యలన్నింటికీ ఆ నెంబరు పరిష్కార గమ్యంగా ఉండాలి. – సినిమా హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, హోటళ్లలో భౌతిక దూరం తప్పనిసరి. – కన్వెన్షన్‌ సెంటర్లలో జరిగే ఫంక్షన్లలో రెండు కుర్చీల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూడాలి. – అదే విధంగా థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీగా ఉంచాలి. – ఆస్పత్రుల పిపేర్డ్‌నెస్‌. ఆ ఆస్పత్రులలో మంచి వైద్య సదుపాయాలు, వైద్యులు అందుబాటు, శానిటేషన్‌ పక్కాగా ఉండేలా చూడాలి. – కోవిడ్‌ నిర్థారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లు.. కరోనా టెస్టు కోరుకున్న వారికే టెస్టు చేయాలి. – గ్రామాలు, వార్డులలో ఇప్పటికే వలంటీర్ల ద్వారా సర్వే. ఎవరైనా జ్వరంతో బాధ పడుతున్నా, లేదా అలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయిస్తున్నాము. – అన్ని ఆస్పత్రులలో తగినంత ఆక్సీజన్‌ సరఫరా ఉండాలి. విశాఖలోని ప్లాంట్‌ నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలి. – అవసరమైతే ఆక్సీజన్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టండి. కాగా, రోజుకు 310 టన్నుల ఆక్సీజన్‌ సరఫరాకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని సమావేశంలో అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 146 ఆస్పత్రులలో 26,446 ఆక్సీజన్‌ బెడ్లు ఉండగా, అన్ని ఆస్పత్రులలోని ఆక్సీజన్‌ బెడ్లు ఆక్యుపై అయితే రోజుకు మొత్తం 347 కిలో లీటర్ల ఆక్సీజన్‌ అవసరం ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఆక్సీజన్‌ను 577 కిలో లీటర్ల పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం (స్టోరేజీ కెపాసిటీ) ఉందని, అది అన్ని ఆస్పత్రులకు ఒకటిన్నర రోజుకు సరిపోతుందని అధికారులు చెప్పారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

Comments