ఉత్తమ సేవలు అందిస్తున్న వాలంటీర్లుకు సత్కారానికి ప్రభుత్వం 261కోట్లు మంజూరు... 

 పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు (prajaamaravathi); ఉత్తమ సేవలు అందిస్తున్న వాలంటీర్లుకు సత్కారానికి ప్రభుత్వం 261కోట్లు మంజూరు...


రేపు ఏలూరు ఇండోర్ స్టేడియంలో సేవా పురస్కారాలు అందచేత... ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోఏర్పాట్లు పై అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు సమీక్షా... కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయండి... రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా గ్రామ, వార్డ్ వాలంటీర్లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా సేవా పురస్కారాలు అందించడం కోసం 261కోట్లు రూపాయలు నిధులు మంజూరు చేసినట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు... రేపు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుండి సేవా పురస్కారాలు కార్యక్రమం ప్రారంభం చేస్తారని, సోమవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమం పకడ్బo దిగా నిర్వహించాలని, వేసవిని దృష్టిలో పెట్టుకొని వాలంటీర్లు కు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆళ్ల నాని జిల్లా అధికారులను అదేశించారు... ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారంమంత్రి ఆళ్ల నాని జిల్లా జాయింట్ కలెక్టర్లు హిమాన్షు శుక్లా, తేజ్ భరత్ ఏలూరు ఇంచార్జి RDO పద్మావతి, MRO సోమశేఖర్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు... సేవా వజ్రా, సేవా రత్న, సేవా మిత్ర, పేరిట విశిష్ట సేవలు అందించిన గ్రామ, వార్డ్ వాలంటీర్లు కు నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్టు మంత్రి ఆళ్ల నాని చేప్పారు... జిల్లా వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు నిర్వహించే సేవా పురస్కారాలు, సర్టిఫికెట్స్ పంపిణి, బ్యాడ్జిలు వాలంటీర్లు అందరికి అందించడం కోసం చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని అధికారులకు సూచించారు... ఇండోర్ స్టేడియంలో జరగనున్న సేవా పురస్కారాలు పంపిణి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మాస్కలు ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని, శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని, మంత్రి ఆళ్ల నాని అధికారులకు విజ్ఞప్తి చేశారు... ప్రతి నెల 1వ తేదిన ఉదయం 6గంటలకు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్స్ అందిస్తూ, ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లు వ్యవస్థ ఎంతగానో ఉపయోగకరంగా ఉందని, వారిని సేవా పురస్కారాలతో సత్కరించడం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం శుభ పరిణామం అని మంత్రి ఆళ్ల నాని తెలిపారు..

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image