. జగనన్న విద్యాదీవెన ద్వారా 57,238 మందికి లబ్ది
రూ.29.22కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి లబ్దిదారుల నుంచి హర్షం విజయనగరం, ఏప్రెల్ 19 (prajaamaravathi) ః పేదల జీవితాల్లో వెలుగును నింపే జగనన్న విద్యాదీవెన పథకం క్రింద జిల్లాలో 57,238 మంది విద్యార్థులకు లబ్ది చేకూరినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ చెప్పారు. సుమారు రూ.29కోట్ల 22 లక్షలు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అయినట్లు ఆయన తెలిపారు. లబ్ది పొందిన విద్యార్థుల్లో 44,139 మంది బిసి విద్యార్థులు, 5,304 మంది ఎస్‌సిలు, 3,551 మంది ఎస్‌టిలు, 2,995 మంది ఇబిసిలు, 914 మంది కాపు విద్యార్థులు, 294 మంది ముస్లిం, 41 మంది క్రిష్టియన్ మైనారిటీ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, కష్టపడి చదివి, తల్లితండ్రులకు మంచి పేరు తేవాలని, విద్యలనగరంగా జిల్లాకు ఉన్న పేరును సార్ధకం చేయాలని కలెక్టర్ కోరారు. జగనన్న విద్యాదీవెన పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. విద్యార్థుల కాలేజీ ఫీజులను నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి, వివిధ జిల్లాల కలెక్టర్లు, లబ్దిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, ముఖ్యమంత్రితో మాట్లాడుతూ, విద్యాదీవెన గొప్ప పథకమని పేర్కొన్నారు. ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపుతుందని, వారు ఉన్నత చదువులు చదివేందుకు దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపి బెల్లాన చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డిడి కె.సునీల్ రాజ్‌కుమార్, పలువురు విద్యార్థులు, వారి తల్లులు పాల్గొన్నారు. మా పిల్లలకు జగన్ మామయ్యే అండ ః కొమ్మూరు రాజ్యలక్ష్మి, వైఎస్ఆర్ కాలనీ, విజయనగరం. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పిజి చదువుతున్న విద్యార్థుల వరకూ, అందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ఒక మేనమామలా అండగా నిలిచి ఆదుకుంటున్నారని, విజయనగరం వైఎస్ఆర్ కాలనీకి చెందిన కొమ్మూరి రాజ్యలక్ష్మి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడుతూ, విద్యాదీవెన పథకంతోపాటుగా, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఒక కొడుకు, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని, విద్యాదీవెన, అమ్మ ఒడి పథకాల వల్ల వారు ముగ్గురూ నిశ్చింతగా చదువుకుంటున్నారని చెప్పారు. తన భర్త ఆటోడ్రైవర్ అని, వాహన మిత్ర పథకం వల్ల తాము కరోనా కష్టకాలంలో కడుపునిండా భోజనం చేయగలిగామని అన్నారు. దాదాపు ఆరునెలల పాటు ఉచితంగా రేషన్ ఇచ్చి తమను ఆదుకున్నారని చెప్పారు. తమ కుటుంబానికే కాకుండా, అన్ని వర్గాల ప్రజలకీ ముఖ్యమంత్రి చాలా మేలు చేశారని కొనియాడారు. ఇప్పుడు ఆడపిల్ల ధైర్యంగా బయటికి వెళ్లి రాగలుగుతోందని, జగనన్న రక్షణ కవచంగా నిలిచారని అన్నారు. ఇంగ్లీషు మీడియం చదువులు ఎంతో అవసరమని, దానికోసం ఇకముందు ప్రయివేటు స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. నాడూ-నేడు ద్వారా బాగుపడిన బడులను చూస్తుంటే ముచ్చటేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి తనకు ఒక సోదరుడిగా, తన బిడ్డలకు మేనమామగా అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని, ఆయన పదికాలాలపాటు ఆయురారోగ్యాలతో ఉండి, ముఖ్యమంత్రిగా చిరకాలం కొనసాగాలని రాజ్యలక్ష్మి ఆకాంక్షించారు.
addComments
Post a Comment