అవార్డులు అందుకున్న వలంటీర్ల అభిప్రాయాలు.*ఈ

 *అవార్డులు అందుకున్న వలంటీర్ల అభిప్రాయాలు.*ఈ


అవార్డు.. నా బాధ్యతను మరింత రెట్టింపు చేస్తోంది.* *నా బందువులకంటే.. మా సచివాలయ పరిధిలోని కుటుంబాలతోనే.. విడదీయరాని బంధం ఏర్పడింది. ప్రతిరోజు ఎదో ఒక అవసరం నిమిత్తం ముసలీ ముతక, పెద్ద చిన్న, విద్యార్థులు.. ఇలా అందరి వాడి అయ్యాను. పెద్ద చదువులు, ఉన్నతమైన ఉద్యోగాల మాట పక్కనపెడితే.. ప్రభుత్వ పథకాల అమలులో మేమే కీలకం అన్న ఫీలింగ్ లో వున్నా. ముఖ్యమంత్రి సార్.. చెప్పినట్లు వలంటీర్ ఉద్యోగమనో.. లేక ప్రభుత్వ సేవకున్నో తెలియదు కానీ.. ఈ విధులు నిర్వర్తించడం ప్రజలకు నా వంతు బాధ్యతగా నిర్వర్తించాల్సిన కర్తవ్యంగా భావిస్తున్నా. ఈ రోజు జగన్ సార్ అందించే 'సేవా వజ్ర' పురస్కారం, రూ.30 వేలు నగదు బహుమానం అందుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఈ అవార్డు.. నాలో మరింత బాధ్యతను గుర్తు చూస్తోంది. అందరికీ ధన్యవాదాలు.* *- వేల్పుల కుమారస్వామి, వేంపల్లి సెక్రటేరియట్ 2, వేంపల్లి మండలం, పులివెందుల నియోజకవర్గం, కడప జిల్లా* ** *జగన్ సార్ సారథ్యంలో సేవ చేయడం నా అదృష్టం.* *వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన రోజే అనుకున్నా... ఆయన పాలన దేశ చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలిచి పోతుందని !. జగన్ సార్ సారథ్యంలో ప్రభుత్వ సేవకులుగా పనిచేసే అవకాశాన్ని ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నా. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నా చేతిలోనే ఉన్నాయి.. నేనే మా ప్రాంత ప్రజలకు చేరవేయగలుగుతున్నాను.. అనే సంతృప్తితో పాటు.. అందరిలో నాకు ఓ గుర్తింపును కూడా ప్రభుత్వం నాకు ఇచ్చింది. ఈ రోజు "సేవా రత్న" ద్వారా రూ. 20 వేల నగదు అందుకోవడం మరపురాని దినం.* *- తుపాకుల పుష్పావతి, వేల్పుల గ్రామం, వేముల మండలం, కడప జిల్లా.* ** *బ్యాడ్జ్ ను ధరించడం గర్వంగా భావిస్తున్నా.* *“సేవా మిత్ర ' తొలి కేటగిరిలో రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వం ఎంపిక చేసిన1244 మందిలో నన్ను ఒక ఉత్తమ ప్రభుత్వ సేవకురాలిగా గుర్తించి పురస్కారం అందజేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఇంత మంది పెద్దల సమక్షంలో అవార్డు, రూ.10 వేల మొత్తంతో పాటు.. బ్యాడ్జ్ ను ధరించడం గర్వంగా భావిస్తున్నా. ఊర్లో నేనంటే ఎవరో తెలియని నాకు... ప్రభుత్వం కల్పించిన వాలంటరీ వ్యవస్థ ద్వారా... మంచి గుర్తింపు వచ్చింది. నా సేవలను గుర్తించిన వారందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు.* *- వి.ఆంజనేయమ్మ, మబ్బుచింతలగ్రామం, వేముల మండలం, కడప జిల్లా.*

Comments