అమరావతి (prajaamaravati); . నేడు తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలసిన రాష్ట్ర మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు* . *భీమిలి
నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై.. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు.* విజయవాడ తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని పర్యటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకో రాగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. భీమిలీ నియోజకవర్గంలోని పద్మనాభం లో జూనియర్ కళాశాల ( కో ఎడ్యుకేషన్ ), మదురవాడలో డిగ్రీ కళాశాల ( కో ఎడ్యుకేషన్), భీమిలిలో డిగ్రీ కళాశాల( బాలికల) ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి కోరారు. ఇంకా భీమిలి నియోజకవర్గంలో నాడు - నేడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కోసం వివరించారు.. అలాగే ఈ క్రింది పనుల కోసం మొత్తం రూ.3611.00 లక్షలతో అభివృద్ధి..పనులు కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ▪️ప్రస్తుతం ఉన్న 30 పడకల సిహెచ్‌సి, భీమునిపట్నం 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని 1680 లక్షలతో ▪️సిహెచ్‌సి, భీమునిపట్నంకు నూతన మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడం రూ.240.00 లక్షలు. ▪️ప్రస్తుతం ఉన్న పిహెచ్‌సి, మధురవాడను 30 పడకల ఆసుపత్రికి పెంచడం. రూ.380.00 లక్షలు ▪️పిహెచ్‌సి, మధురవాడకు మౌలిక సదుపాయాలు కల్పించడం రూ.81.00.లక్షలు ▪️ఇప్పటికే ఉన్న పిహెచ్‌సి, ఆర్.తల్లవాలస 30 పడకల ఆసుపత్రికి అభివృద్ధి కోసం రూ.410.00 .లక్షలు ▪️ప్రస్తుతం ఉన్న పిహెచ్‌సి, ఆనందపురం 30 పడకల ఆసుపత్రికి అభివృద్ధి కి రూ.410.00 లక్షలు ▪️ఇప్పటికే ఉన్న పిహెచ్‌సి, రేవాడి 30 పడకల ఆసుపత్రికి అభివృద్ధి కి రూ.410.00.లక్షలు సాగర్ నగర్ నుంచి భీమిలీ బీచ్ ఫ్రంట్ అభివృద్ధి కొరకు 63 కోట్ల రూపాయలు నిధులు మంజూరుకు చొరవ తీసుకోవాలని దీని ద్వారా పర్యాటకులకు ఆహ్లాదకరమైన ప్రాంతాలుగా ఏర్పాటు కు కృషి చేస్తున్నామని చెప్పారు.అంతేకాకుండా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సాగర్ నగర్ (జూ పార్క్ దగ్గర), పెడ్డా రుషికొండైట్ Jn., ఎం. తిమ్మపురాము బీచ్, తోట్లకొండ బీచ్ (సిలతోరనం నేచురల్ ఆర్చ్ దగ్గర), మంగమారిపేట బీచ్, చేపలుప్పడ బీచ్, ఐఎన్ఎస్ కళింగ బీచ్, ఎర్రమట్టి దిబ్బలు బీచ్ (Opp.Tourism రెస్టారెంట్), భీమిలి (భీమునిపట్నం) ఆయా బీచ్ ప్రాంతాలనుఅభివృద్ధి చేస్తూ... ఆయా బీచ్ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు అయిన లేడీస్ టాయిలెట్ / జెంట్స్ టాయిలెట్ తాగునీరు, దుస్తుల మార్పు గదులు ప్రథమ చికిత్స కేంద్రం, సిసిటివి కంట్రోల్ రూమ్, సిట్టింగ్ బెంచీలు ఫుడ్ కోర్టులు, పిల్లల పార్క్,పార్కింగ్, అభివృద్ధికి సుమారు రూ .63 కోట్లు ఖర్చు అవుతుందని తెలియచేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దింతో ఉపాధి కల్పించడంతో పాటు పర్యాటక అభివృద్ధికి స్థానికులకు జీవనోపాధి పెరుగుతుందని తెలిపారు. ఇంకా పలు అంశాలను సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించారు. అభివృద్ధి పనులు , నియోజకవర్గంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలమీద చర్చించారు. ఈ అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారని మంత్రి ముత్తంశెట్టి తెలిపారు.
addComments
Post a Comment