ఏపీలో విపరీతమైన అవినీతి ఉంది: జేపీ నడ్డా 

 ఏపీలో విపరీతమైన అవినీతి ఉంది: జేపీ నడ్డా నెల్లూరు (prajaamaravathi): వైసీపీ ప్రభుత్వం అవినీతిమయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తిరుపతి ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి రత్నపభ తరపున ఆయన నాయుడుపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విపరీతమైన బంధు ప్రీతి ఉందన్నారు. ఏపీలో 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని చెప్పారు. నిందితులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. ఏపీలో సెక్యులరిజం లేదనిపిస్తోందన్నారు. ‘‘ప్రభుత్వ కనుసన్నల్లో మత మార్పిడులు జరుగుతున్నాయి. ఒక మతం కోసమే ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఉంది. ఏపీలో విపరీతమైన అవినీతి ఉంది. లిక్కర్, శాండ్‌, ల్యాండ్, పోర్టుల్లో అవినీతి. ప్రతి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది. 4 లక్షల కోట్లకు ఏపీ అప్పులు చేరుకున్నాయి. సీమ ప్రాంతం ఎంతగానో వెనుకబడిపోయింది.’’ అని జేపీ నడ్డా అన్నారు.

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image