అమరావతి (prajaamaravati);. ఐక్యత, స్వచ్ఛత, సురక్షిత విధానాలతో సుస్థిరాభివృద్ధి దిశగా అడుగులు : పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* *
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* *"ఎనేబులింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటి" అంశంపై మాట్లాడిన మంత్రి మేకపాటి* అమరావతి, ఏప్రిల్, 07; సరిహద్దులులేని సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున స్వీకరించడంపై భవిష్యత్ ఆధారపడి ఉంటుందని పరిశ్రమలు,ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. భవిష్యత్ వైపు అడుగులు వేసే దిశగా నాలుగు స్తంభాలైన సానుకూల పాలసీ, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవవనరులను కీలకమని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ప్రజలు, ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమన్నారు. చైతన్యం నిండిన భవిష్యత్ తోనే అభివృద్ధి సాకారమవుతుందన్నారు. అందుకోసం ప్రధానంగా ఎలక్ట్రిక్ రంగం, డ్రోన్ల రంగంవైపు నడవాలన్నారు. ఈవీ రంగాన్ని విస్తరించడం కోసం ఛార్జింగ్ స్టేషన్లు, వాహనాలు, ఉత్పత్తి, తయారీ, మౌలిక సదుపాయాలది కీలక పాత్రన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో 2024 కల్లా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 2030 కల్లా ఏపీలోని అన్ని నగరాలకు విస్తరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. సరికొత్త టెక్నాలజీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిపుచ్చుకుంటూ ముందుకు వెళతామని మంత్రి మేకపాటి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ద్విచక్రవాహనాలను పరిశీలనకై రాష్ట్రవ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నాస్ కమ్ ఆధ్వర్యంలో ఐవోటీ, ఏఐ ఆధారిత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను విశాఖలో స్థాపించడం, 10 కీలక రంగాలకు సంబంధించిన స్టార్టప్ లను ప్రారంభించనున్నట్లుగా మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో 500 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఇది భారతదేశంలో సరికొత్త ఆవిష్కరణ, ఆలోచన, ఆచరణ అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక హంగులతో కూడిన ప్రపంచస్థాయి 30 స్కిల్ కాలేజీలు, హై ఎండ్ స్కిల్ విశ్వవిద్యాలయం, నైపుణ్య మానవవనరులను తీర్చిదిద్దడంతో పాటు వాతావరణ, సామాజిక, పాలనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఆర్థిక పురోగతికి, అభివృద్ధికి ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి? ప్రజల నమ్మకం పాత్ర ఎంత? వంటి ప్రశ్నలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి సమాధానాలు చెప్పారు. -
addComments
Post a Comment