ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు వ్యూహాత్మక అడుగులు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు వ్యూహాత్మక అడుగులు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.*


*ఆసుపత్రులకు ఆక్సిజన్ అందించేందుకు ఏపీ పటిష్ట కార్యాచరణ*


*ప్రాణవాయువు సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ*


*కరోనా రోగుల ప్రాణాలను  కాపాడేందుకు చర్యలు*


*ఆక్సిజన్ కొరతతో పొరుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న మరణాలు*


*దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆక్సిజన్ ఉత్పత్తి కన్నా డిమాండ్ ఎక్కువ* 


*ప్రత్యామ్నాయ మార్గాలు చూపే దిశగా  గురువారం మంత్రి మేకపాటి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష*


అమరావతి, ఏప్రిల్, 21 (ప్రజా అమరావతి); కరోనా సెకండ్ వేవ్ వింభిస్తున్న వేళ..  ఆక్సిజన్ అవసరం పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  అప్రమత్తమైంది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన వైద్య, హోం, కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మనసున్న దార్శనిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే ప్రాధాన్యతగా రాష్ట్రంలోని ఆక్సిజన్ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యామ్నాయం చూపే దిశగా పల కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది . అవసరమైతే గ్రామీణ  ఆక్సిజన్ ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్న వారిని ఆదుకోవడానికి గల అవకాశాలపై మంత్రి మేకపాటి సమీక్ష నిర్వహించనున్నారు. తప్పనిసరి పరిస్థితులలో అవసరమయితే పరిశ్రమలకు ఇతర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించే అవకాశాలపై పరిశ్రమల శాఖ  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  గురువారం ఉన్నతస్థాయి సమీక్షకు రంగం సిద్ధం చేశారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా వైద్య,పరిశ్రమలు, హోమ్ , కుటుంబ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ఉదయం 11గం.లకు  మంత్రి మేకపాటి సమీక్ష నిర్వహించనున్నారు. 


ప్రాణవాయువు కొరతతో దేశవ్యాప్తంగా ఏపీ పొరుగు రాష్ట్రాలలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ నెల 18న కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నేటి  (22వతేదీ)  నుంచి ఫార్మ, పెట్రోలియమ్ రిఫైనరీలు, ఉక్కు కర్మాగారాలు, ఆక్సిజన్ సిలిండర్ల తయారీ, న్యూక్లియర్ ఎనర్జీ ఫెసిలిటీస్, ఆహార, నీటి శుద్ధి, వ్యర్థపు నీటిని మంచినీరుగా మార్చే ప్లాంట్లు, ఇంజక్షన్,సీసాల వంటి ముఖ్య తయారీ పరిశ్రమలకు మినహాయించి మిగతా  పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేయాలని  కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు  మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా పరిశ్రమలకు ప్రత్యామ్నాయ మార్గాలు సహా కీలక విషయాలపై సమగ్రంగా చర్చించనున్నారు మంత్రి గౌతమ్ రెడ్డి.  కరోనా కేసులు రోజురోజుకు పెరగడం, మరణాల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ కు డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని ఆసుపత్రులకు సరఫరా చేయడమే ప్రథమ ప్రాధాన్యతగా భావించి ప్రజల ప్రాణాలను రక్షించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేయడానికి సమాయత్తమవుతోంది.  కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తొమ్మిది రకాల పరిశ్రమలు కాకుండా ఏవైనా ఇతర ఆక్సిజన్ ఆధారిత పరిశ్రమలు ఉన్నట్లయితే వాటికి స్వతహాగా ఆక్సిజన్ (ఎయిర్ సెపరేటర్ యూనిట్ల(ఏఎస్ యూ)) నెలకొల్పుకునేందుకు, లేదా ఆక్సిజన్ ను దిగుమతి చేసుకునే అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ వినియోగంతో నడిచే పరిశ్రమలపై జిల్లా పరిశ్రమల శాఖ అధికారుల ఆధ్వర్యంలో పర్యవేక్షణకు సంబంధించిన పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. రేపటి ఈ సమావేశంలో వైద్య, కుటుంబ సంక్షేమ, శాంతి భద్రతలు, పరిశ్రమల శాఖలు భాగస్వామ్యమవనున్నాయి.


Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image