వైద్య ఆరోగ్య శాఖలో నాడు–నేడు కార్యక్రమంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష..

  అమరావతి (prajaamaravathi). వైద్య ఆరోగ్య శాఖలో నాడు–నేడు కార్యక్రమంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష..


వాక్సినేషన్: - రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 1.4 లక్షల మందికి కరోనా వాక్సినేషన్ వేస్తున్నామన్న అధికారులు - కేంద్రం మార్గదర్శకాల ప్రకారం వాక్సినేషన్‌కు మన యంత్రాంగం సర్వం సమాయాత్తమై ఉందని, అయినా తగినన్ని డోసుల వాక్సిన్ అందుబాటులో లేదని సీఎంకు వివరించిన అధికారులు - ఇవాల్టికి ౩ లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని సీఎంకు వివరించిన అధికారులు -రెండు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయన్న అధికారులు : - మన అవసరాలకు తగినన్ని డోసుల వాక్సిన్ సరఫరా కావడం లేదని సీఎంకు వివరించిన అధికారులు _ కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి అవసరమైనన్ని డోసులు వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు - మన అవసరాలకు సరిపడా వాక్సిన్ వచ్చేలా చూడాలన్న సీఎం -కోవిడ్ నివారణకు వాక్సినేషన్‌ ఒక్కటే మార్గం : సీఎం వాక్సినేషన్‌పై అధికారులు మరింత చురుగ్గా దృష్టి సారించాలి : సీఎం -కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అందరికీ వాక్సినేషన్‌ ప్రక్రియ జరగాలి : సీఎం - ప్రస్తుతం అర్భన్ లో వార్డు సచివాలయాల్లో జరుగుతున్న వాక్సినేషన్‌ను రూరల్ లో కూడా జరిగేలా చూడాలన్న సీఎం - రాష్ట్రంలో 45 ఏళ్ళకు పైబడి ఇంకా వాక్సినేషన్ చేయించుకోవాల్సిన వారు సుమారు కోటి మంది వరకు వుంటారని వివరించిన అధికారులు - వారికి నెల రోజుల్లో వాక్సినేషన్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం - గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4 లక్షలు, అర్భన్ ప్రాంతాల్లో రోజుకు 2 లక్షల మందికి వాక్సినేషన్ అందించాలన్న లక్ష్యంతో పనిచేయాలన్న సీఎం - పిహెచ్‌సిల్లో ఇద్దరు, 104లో ఒక వైద్యుడు అందుబాటులో వున్న నేపథ్యంలో ప్రతి వైద్యుడు తన పిహెచ్‌సి పరిధిలో నిర్ధేశిత గ్రామాల్లో పర్యటించి వైద్యసేవలు అందించాలన్న సీఎం - దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ సిద్దం చేయండి: సీఎం - పిహెచ్‌సి వైద్యులు, 104 అంబులెన్స్‌లో పనిచేసే వైద్యుల విధులను పున:సమీక్ష చేయాలన్న సీఎం - ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమల్లోకి తీసుకురావడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందో పరిశీలించాలని అధికారులను ఆదేశించిన సీఎం - ప్రతి పీహెచ్‌సికి 104 అంబులెన్స్‌లు వున్నాయా లేదా అని సమీక్షించుకోవాలి, లేనిపక్షంలో అవసరమైన అంబులెన్స్‌లను సమకూర్చుకోవాలన్న సీఎం - వాక్సినేషన్‌ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వలంటీర్లు, ఆశావర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించిన సీఎం - అప్పుడే అనుకున్న విధంగా వాక్సినేషన్ ప్రక్రియ సకాలంలో పూర్తవుతుందన్న సీఎం - వాక్సినేషన్ కోసం అవసరమైన డోస్‌లను సిద్దం చేసుకోవడం ద్వారా వాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలన్న సీఎం *కోవిడ్ నివారణ, నియంత్రణ సంసిద్దతపై సమీక్ష* -కోవిడ్ చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ జరగడానికి వీల్లేదు : సీఎం -ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే చికిత్స జరగాలి : సీఎం -అంతకుమించి అదనంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయడానికి వీలులేదు, దీనిపై అధికారులు కచ్చితమైన పర్యవేక్షణ ఉండాలి : సీఎం అలా కాకుండా అధిక ధరలపై ఫిర్యాదులు వస్తే సంబంధిత ఆసుపత్రిపై తక్షణమే చర్యలు : అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు - టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌పై దృష్టి పెట్టాలన్న సీఎం - మాస్క్‌ పెట్టుకోని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి - రాష్ట్ర వ్యాప్తంగా 66 కోవిడ్ ఆసుపత్రులు వున్నాయని వివరించిన అధికారులు - జిల్లాల్లో హేతుబద్దంగా కోవిడ్ ఆసుపత్రులను నిర్వహించాలని, కొన్ని చోట్ల తక్కువగా ఆసుప్రతులు వుండటంపై అధికారులను ఆరా తీసిన సీఎం - కోవిడ్ వచ్చిన వారు ఆసుపత్రుల్లో బెడ్ కోసం 104 కి ఫోన్ చేసి అడిగితే గతంలో ఎలా సమకూర్చామో, ఇప్పుడు కూడా అలాగే చేయాలన్న సీఎం - వెంటనే మొత్తం యంత్రాంగం ఆ ఒక్క ఫోన్‌కాల్‌ కు స్పందించాలి - కోవిడ్ పేషంట్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచితంగా అందించాలి - దీనికి సంబంధించి అన్ని విభాగాలతో సమన్వయం చేయాలన్న సీఎం - 104, పిహెచ్‌సి వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆసుపత్రులను అందుబాటులో వుంచుకోవాలి. - ఆసుపత్రుల్లో స్టార్‌ రేటింగ్ ఇచ్చి మానిటరింగ్ చేయాలి. - ఆసుపత్రుల్లో ఫుడ్, ఇతర సదుపాయాలు అందుబాటులో వుంచాల : సీఎం - శానిటేషన్, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆక్సిజన్‌తో పాటు మందులు కూడా అందుబాటులో ఉంచాలి: - 104 నెంబర్‌ పై మరోసారి ప్రజలందరికీ విస్తృతమైన అవగాహన కల్పించాలి : సీఎం - ఎంప్యానెల్ ఆసుపత్రులన్నీ సిద్దమైన తరువాత 104 నంబర్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలి : - కోవిడ్ కిట్‌లను అందుబాటులో వుంచుకోవాలి : - ప్రతి ఆసుపత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు వుండాలి, ఆరోగ్యమిత్ర సిద్దంగా వుండాలి : - పేషంట్ల నుంచి ఒకసారి ఫోన్ ద్వారా ఫిర్యాదు వచ్చిన తరువాత దానిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నామనే దానిపైన యాక్షన్ ప్లాన్ వుండాలి: - మళ్ళీ లాక్‌డౌన్ పరిస్థితులు వస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది: - కోవిడ్ వల్ల గత ఏడాది రాష్ట్రానికిరూ.21 వేల కోట్లు ఆర్థికంగా నష్టం వచ్చింది - ఇటువంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూడాలి - కోవిడ్ నివారణ, నియంత్రణపై ప్రజల్లో అవగాహన, ఎడ్యుకేషన్ పెంచాలి - గుంటూరు, చిత్తూరు, విశాఖ, కృష్ణాల్లో కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని వివరించిన అధికారులు - రాష్ట్ర వ్యాప్తంగా 22 కోవిడ్ కేర్ సెంటర్లు వున్నాయన్న అధికారులు - కోవిడ్ కేర్ సెంటర్లు కూడా గతంలో ఏ విధంగా సేవలు అందించాయో, ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేసేలా సిద్దం చేయాలన్న సీఎం - రెమిడెసివీర్ కొరత రాకుండా అవసరమైన డోసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం - హోం ఐసోలేషన్ కోవిడ్ మెడిసిన్ కిట్‌లు 4 లక్షల వరకు అందుబాటులో వున్నాయన్న అధికారులు - కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి నియామకాల్లో వెయిటేజీ ఇవ్వడం వల్ల వారిని ప్రోత్సహించినట్లు అవుతుందన్న సీఎం *వైయస్‌ఆర్ హెల్త్ క్లీనిక్స్:* - వైయస్‌ఆర్ హెల్త్ క్లీనిక్స్‌కు మంచి రంగులు వేయాలి. చూడగానే ఇది ఆసుపత్రి అనే భావాన్ని కలిగించేలా, ఆకట్టుకునేలా వుండాలన్న సీఎం - నాడు-నేడు స్కూల్స్ తరహాలో వైబ్రెంట్‌గా వుండాలి : సీఎం - అన్నిచోట్ల కూడా షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా? : సీఎం - వైయస్‌ఆర్ హెల్త్ క్లీనిక్స్‌కు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయండి : అధికారులకు సీఎం ఆదేశం *కొత్త మెడికల్ కాలేజీలు* - రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్ కాలేజీలకు గానూ 8 కాలేజీలకు భూసేకరణ పూర్తయ్యిందని వివరించిన అధికారులు. - మిగిలిన ఎనిమిదింటికి కూడా భూసేకరణ త్వరతిగతిన చేపట్టాలి సీఎం ఆదేశం - వచ్చే కేబినెట్ మీటింగ్ నాటికి మొత్తం మెడికల్ కాలేజీలకు భూసేకరణ పూర్తి కావాలన్న సీఎం - పదహారు కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించిన స్టేటస్‌ను వివరించిన అధికారులు - జూలై 1వ తేదీ నాటికి కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభం కావాలన్న సీఎం - విలేజ్ క్లీనిక్‌ ల నుంచి పిహెచ్‌సి, సిహెచ్‌సి, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల వరకు జాతీయ స్థాయి ప్రమాణాలతో వుండాలన్న సీఎం - దీనికి సంబంధించి ఎస్‌ఓపిలు తయారు చేయాలన్న సీఎం - కొత్త మెడికల్ కాలేజీల్లో రిక్రూట్‌మెంట్‌ పకడ్భందీగా జరగాలన్న సీఎం - వైద్యులు, సిబ్బంది కొరత వుందనే విమర్శలు రాకూడదన్న సీఎం - మెడికల్ డిపార్ట్‌మెంట్లు అన్ని ఒకే గొడుగు కింద వుంటే... రిక్రూట్‌మెంట్ సులువుగా, ఒక పద్దతిగా జరుగుతుంది. - నాడు-నేడు కింద చేపట్టే పనులకు ఇచ్చే నిధులు విషయంలో మరింత అప్రమత్తంగా వుండాలి. ఎక్కడా జాప్యం జరగకూడదు. *ఆసుపత్రుల నిర్వహణ* - హాస్పటల్ డెవలప్‌మెంట్ ఫండ్ విడుదల విషయంలో ఎక్కడా కూడా జాప్యం జరగకూడదన్న సీఎం - దీనిపై ఒక పాలసీ రూపొందించి, ఒక ప్రొసీజర్ ప్రకారం ఎప్పటికప్పుడు జరుగుతూ వుండాలి. - ఆసుపత్రుల నిర్వహణ ను మెడికల్ సూపరింటెండ్ లకే వదిలేయడం వల్ల మేనేజ్‌మెంట్‌ విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించిన అధికారులు. - నిర్వహణ శాస్త్రీయంగా వుండటానికి హాస్పటల్ మేనేజర్‌లను నియమించుకోవాలన్న అధికారులు - హాస్పటల్ నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను వారు పర్యవేక్షిస్తారు. - క్లీనికల్ నిర్ణయాలు మినహా మిగిలిన ఆసుపత్రి నిర్వహణను మేనేజర్లు పర్యవేక్షిస్తారని వివరించిన అధికారులు. - పలు రాష్ట్రాల్లో ఈ విధానంను ఇప్పటికే అమలు చేస్తుండటంతో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపిన అధికారులు. - ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న సదుపాయాలు ఎలా వుంటాయో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అదే విధమైన సదుపాయాలు రోగులకు అందాలన్న సీఎం - హాస్పటల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి మెడికల్ కాలేజీల్లో ప్రత్యేకంగా కోర్స్‌ ఏర్పాటు చేయాలన్న సీఎం - హాస్పటల్ మేనేజ్‌మెంట్‌పై ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులను భాగస్వాములను చేసి, వారి సూచనలు, సలహాలు తీసుకోవాలన్న సీఎం - ప్రైవేటు లో ఎలా చేస్తున్నారో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అలా జరగాలి : - ఆసుపత్రుల నిర్మాణం జరిగేప్పుడే అవసరమై సదుపాయాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి : - ప్రతి ఆసుపత్రి నిర్వహణపైనా ఆడిట్, సూపర్ విజన్ జరగాలి. - ఇవి వుంటేనే మనం అనుకున్న విధంగా సదుపాయాలు ప్రజలకు అందుతాయన్న సీఎం - హాస్పటల్ మేనేజ్‌మెంట్ పోస్ట్‌ల పదోన్నతులు పనితీరు ఆధారంగా వుండాలి తప్ప, సిఫార్సుల ఆధారంగా కాదు : సీఎం ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఆర్ధిక శాఖ కార్యదర్శి గుల్జార్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఛైర్మన్‌ డాక్టర్‌ బి.చంద్రశేఖర్‌ రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ విజయరామరాజు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మల్లిఖార్జున, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments