తెలుగు ప్రజలకు టీటీడీ చైర్మన్ ఉగాది శుభాకాంక్షలు. తిరుమల (prajaamaravathi) : తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దయతో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆయన కోరారు. సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజలందరూ క్రమశిక్షణతో మెలగుతూ, కోవిడ్ నిబంధనలు పాటించాలని శ్రీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. మనం ఆరోగ్యం గా ఉంటూ సమాజాన్ని కూడా ఆరోగ్యం గా ఉంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని శ్రీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగు ప్రజలకు టీటీడీ చైర్మన్ ఉగాది శుభాకాంక్షలు.
addComments
Post a Comment