జడ్ పిటిసి, యంపిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం..



 చిత్తూరు (ప్రజా అమరావతి); 


 



 జడ్ పిటిసి, యంపిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం.. 



 ప్రశాంత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు చర్యలు. 


మొత్తం ఓటర్లు 14,21,276 మంది ...


జిల్లాలో 33 జడ్.పి.టి.సి, 419 యం.పి.టి.సి. స్థానాలకు ఎన్నికలు ..


ఏప్రిల్ 8 న ఉ. 7 గంటల నుండి సా.5 గంటల వరకు ఓటర్లు తమ  ఓటు హక్కు వినియోగించు కోవచ్చు ..


 జడ్ పిటిసికి 114 మంది , యంపిటిసి స్థానాలకు 1040 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 


 జిల్లా కలెక్టర్ (ఇంచార్జ్) డి.మార్కండేయులు.

       

     

జిల్లాలో జడ్ పిటిసి, యంపిటిసి స్థానాలకు జరిగే ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టరు( ఇంచార్జ్) డి.మార్కండేయులు తెలిపారు . శనివారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరం నందు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్,జెడ్.పి సి.ఈ.ఓ ప్రభాకర్ రెడ్డి తో కలసి పాత్రికేయుల  సమావేశం నిర్వహించారు. 


ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జడ్ పిటిసి , యంపిటిసి స్థానాలకు ఈనెల 8 గురువారం ఉ . 7 గంటల నుండి సా . 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు . ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1554 పోలింగ్ కేంద్రాల పరిధిలో 14,21,276 మంది  తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారని కలెక్టరు తెలిపారు . వీరిలో పురుషులు 7,07,071మంది , మహిళలు 7,14,106 మంది , ఇతరులు 99 మంది ఓటర్లు ఉన్నారన్నారు . పోలింగ్ కేంద్రాలలో 455 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు,486 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని 400 మంది వెబ్ క్యాస్టింగ్ పర్సన్స్ ను నియమించమని తెలిపారు. ఎన్నికల నిర్వహణ నిమిత్తం 65 మంది రిటర్నింగ్ అధికారులు, 130 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 1932 మంది పిఓలు, 9660 మంది ఇతర పోలింగ్ సిబ్బంధి ని నియమించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు గాను జోనల్ అధికారులు 154 మంది ,  588 మంది మైక్రో అబ్జర్వర్స్ లను నియమించినట్లు తెలిపారు. మొత్తం 6327 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని అందులో 2977 పెద్దవి, 3350 చిన్నవి, బాక్సులు సిద్ధంగా కలవని తెలిపారు. 40 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటుచేయడం అయినదని కోవిడ్ నేపథ్యంలో అవసరమైన మాస్క్ లు, సానిటైజర్ లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 10 కౌంటింగ్ సెంటర్లను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి 206 మంది కౌంటింగ్ సుపర్వైజర్స్ ను 575 మంది కౌంటింగ్ సిబ్బందిని నియామకం చేసినట్లు,  పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు . 

     

       

జిల్లాలో 65 మండలాలు ఉండగా , 33 మండలాల పరిధిలోని జడ్ పిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని, 30 జెడ్.పి.టి.సి స్థానాలు ఏకగ్రీవం కాగా , 2 జెడ్.పి.టి.సి స్థానాల కు  అనివార్య కారణాల వలన ఎన్నికలు వాయిదా పడ్డాయని తెలిపారు . ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న 33 జడ్ పిటిసి స్థానాలకు 114 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు . జిల్లాలో మొత్తం 886 యంపిటిసి స్థానాలకు గాను 433 స్థానాలు ఏకగ్రీవం కాగా, 34 ఎం.పి.టి.సి స్థానాలకు ఎన్నికలు వాయిదా పడగ 419 స్థానాలకు 1040 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. 

ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఏప్రిల్ 8 వ తేది ఉ . 7 గంటల నుంచి సా . 5 గంటల వరకు జరుగుతుందని , అప్పటికీ క్యూ లైన్ లలో ఉన్నవారందరికీ ఓటుహక్కు కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నదని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు.


Comments