బూత్ ఖర్చుల సొమ్ము సోమిరెడ్డి జేబులోకి..!" 

  బూత్ ఖర్చుల సొమ్ము సోమిరెడ్డి జేబులోకి..!"  శ్రీ పొట్టి శ్రీ


రాములు నెల్లూరు జిల్లా (prajaamaravathi), సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి, ఇస్కపాళెం, నిడుగుంటపాళెం, పుంజులూరుపాడు,గుడ్లూరివారిపాళెం, తిరుమలమ్మపాళెం గ్రామాలలో విద్యాశాఖా మాత్యులు ఆదిమూలపు సురేష్ గారితో కలిసి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.* *సర్వేపల్లి నియోజకవర్గంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో భారీగా పాల్గొన్న జనం. తెలుగుదేశం పార్టీ బూత్ ఖర్చుల కింద కార్యకర్తలకు ఇచ్చే రోజువారి డబ్బులను సోమిరెడ్డి తన జేబులో వేసుకోవడం దుర్మార్గం.  తెలుగుదేశం పార్టీ రోజువారి బూత్ ఖర్చుల కింద బూత్ కు 10 వేల రూపాయల చొప్పున ఇస్తుంటే *"బక్కడు"* సోమిరెడ్డి కక్కుర్తిపడి, ఆ సొమ్మును తన జేబులో వేసుకొని కొన్ని చోట్ల 4 వేల రూపాయల చొప్పున ఇస్తూ, కొన్ని చోట్ల స్థానిక నాయకులను ఖర్చు చేయమని చెబుతూ పార్టీ ఇచ్చిన డబ్బులను కాజేస్తున్నాడు.  ఎలక్షన్లలో కలెక్షన్లకు పాల్పడుతున్న సోమిరెడ్డి ని చూస్తుంటే చంద్రబాబు ఎప్పుడూ చెప్పే *"సంక్షోభంలో అవకాశాలను వెతుక్కోవాలన్న"* వ్యాఖ్యలను నూటికి నూరు శాతం రుజువు చేస్తున్నాడు.  అన్ని చోట్ల అవినీతికి పాల్పడి ,అందరి నోళ్ళు కొట్టే సోమిరెడ్డి చివరకు పార్టీ కార్యకర్తల నోళ్లు కొట్టడం క్షమించరాని నేరం.  అవినీతికి పాల్పడడం, సంపాదనే ధ్యేయంగా బతికే సోమిరెడ్డి, అధికారం లేకపోవడంతో అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదనకు అడ్డదారులు తొక్కుతున్నాడు.  సోమిరెడ్డి పర్యటనలో మమ్మల్ని దూషించడం, విమర్శించడం తప్ప, తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పకోలేని దుస్థితిలో ఉన్నాడు.  సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన సిమెంటు రోడ్లు, డ్రైన్లు నిర్మించడంతో పాటు, తాగునీరు, సాగునీరు లాంటి వసతులు కల్పించి, ప్రజలకు అభివృద్ధి రుచి చూపించాం.  అవినీతికి పాల్పడుతున్న *"బక్కారెడ్డి"* ని తరిమికొట్టడానికి సర్వేపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.  సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో డాక్టరు గురుమూర్తిగారిని అత్యధిక మెజారిటీతో విజయం సాధించేందుకు దోహదపడతాయని నమ్మకం, విశ్వాసం నాకు ఉంది.

Comments