ఆంగ్లోదయం ప్రాజెక్టును ప్రారంభించిన ఐ.టీ; నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


అమరావతి.(ప్రజా అమరావతి);


ఆంగ్లోదయం ప్రాజెక్టును ప్రారంభించిన ఐ.టీ; నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి



పోటీవాతావరణంలో గెలవాలంటే నైపుణ్యం ఎంతో అవసరం


గ్రామీణ, గిరిజన విద్యార్థులకు ఆంగ్ల విద్య ఆవశ్యకతను ముందే గుర్తించిన ముఖ్యమంత్రి 


చిన్నారుల కమ్యునికేషన్ , ఆంగ్లంలో మాట్లాడే విధానం చూస్తుంటే సీఎం సంకల్పం సిద్ధించబోతుందనిపిస్తోంది


ప్రేరణ కలిగించాలని వచ్చాను..కానీ గురుకుల విద్యార్థుల మాటలకు నేనే ప్రేరణ పొందాను


విద్యార్థి దశలోనే ప్రభుత్వ గురుకులాల్లో ఈ స్థాయి కమ్యునికేషన్ చూస్తోంటే ముచ్చటేస్తోంది


టెక్నాలజీ ద్వారా ఏదైనా నేర్చుకోవడం సులభం


త్వరలోనే టెక్నాలజీ ద్వారా ఒక భాష నుంచి మరో భాషకు అనువాదం , మాటలను రాతలుగా మార్చే సాంకేతికత వస్తుంది


ఇప్పటికే పేపర్ లో  రాసిన అక్షరాలు స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా అక్షరాలుగా మారేంత టెక్నాలజీ ఉంది


తెలుగులో మాట్లాడితే ఆంగ్లంలోకి, ఆంగ్లంలో చెబితే మరో  భాషలోకి టైపింగ్ , అర్థం, అవగాహన త్వరలో సాధ్యం


'రీడ్ టు మీ' టూల్ ద్వారా "ఆంగ్లోదయం" వినూత్న, విజ్నాన కార్యక్రమం


రాష్ట్రవ్యాప్తంగా 210 గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే చిన్నారులకు సులభంగా ఆంగ్లం అర్థమయ్యేలా టెక్నాలజీ ఆధారిత వినూత్న కార్యక్రమం


వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖకు చెందిన గురుకుల విద్యార్థిని డాక్టర్ అవ్వాలనుకుంటున్న తన ఆశయాన్ని ఆంగ్లంలో చక్కగా వివరించిన మేఘనను ప్రశంసించిన మంత్రి మేకపాటి


ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్ ను మార్చాలన్న ముఖ్యమంత్రి సంకల్పం వల్లే ఆంగ్లంలో బోధనకు ప్రాముఖ్యత


నాడు నేడు, జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యాకానుక కార్యక్రమాల ద్వారా విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేయడం గురించి మాట్లాడిన గురుకుల పాఠశాల బాలికలు


ప్రతిభ కలిగిన 10 మంది గురుకుల విద్యార్థుల భవిష్యత్ ఉన్నత చదువులకు అండగా ఉంటానని ప్రకటించిన స్కూల్ నెట్ సీఈవో ఆర్ సీఎమ్ రెడ్డి


గురుకుల విద్యార్థులు స్వయంగా గీసిన పెయింటింగ్ లను అందించి సత్కారం


 హాజరైన స్కూల్ నెట్ ఇండియా సీఈవో, ఆర్ సీఎం రెడ్డి, ఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి శ్రీకాంత్ ప్రభాకర్,  ఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్  ఉప కార్యదర్శి బి.దయాకర్, ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ చెందిన ఇంగ్లీష్ సహాయకులు కల్పనా రాజగోపాల్,  ఇంటెల్ సంస్థకు చెందిన దక్షిణ ఆసియా అధ్యక్షులు సునీల్ ఆచార్య, ప్రాంతీయ అధ్యక్షులు ఆకాంక్ష బిలానీ తదితరులు.



Comments