తిరుపతి పార్లమెంట్ బాట...వైసీపీదే బావుటా: ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.



శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.(ప్రజా అమరావతి);


తిరుపతి పార్లమెంట్ బాట...వైసీపీదే బావుటా: ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.



*సూళ్ళూరు పేట..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచే కంచుకోట*


*కంచుకోటను...మంచి కోటగా పెంచుకుంటూ పోతాం*


*తిరుపతి బై ఎలక్షన్ లో వైసీపీదే బావుటా*


*మంచి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పాలన ఉన్న దొరవారిసత్రం మండలంలో టీడీపీకి డిపాజిట్లు* 


*సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రజల మనిషి, ప్రజల్లోనే ఉండే మనిషి*


*సూళ్లూరుపేటలో వైసీపీ జెండా ఎగరాలంటే మంత్రులు రానక్కరలేదు*


*ఇక్కడ ప్రజలు వైసీపీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారు*


*దొరవారిసత్రం మండలంలో ప్రతిపక్షాలు డిపాజిట్లు దక్కించుకోవడం కూడా కష్టమే*


*గత ఎన్నికలలో ఈ మండలంలో 23,893 ఓట్లు పోలయ్యాయి, అందులో వైసీపీవే 15, 891 ఓట్లు పడ్డాయి. 6,290 ప్రతిపక్షాలకు వచ్చాయి.*


*సంక్షేమ పాలనకు నిలువుటద్దంలా ఉన్న తరుణంలో 4వేల ఓట్లు అటు ఇటు అయితే చాలు*


*ఇక్కడి కార్యకర్తల కృతజ్ఞతభావం వలన నాకు కూడా ఎక్కువ కష్టపడకుండానే మంచి పేరు వస్తుందని చమత్కరించిన మంత్రి మేకపాటి*


*ముఖ్యమంత్రి సుపరిపాలనలో, ప్రజలకు ఎమ్మెల్యే అండదండలతో ఈ సారి పోటీలో నిలబడలేరు. తట్టుకోలేరు.*


*ప్రజల్లో ఉంటేనే ఓట్లు..ప్రజలకి మంచి చేస్తేనే మద్దతు*

----------------------------


*మనసు చలించి..మానవత్వం పంచి..*


*రోడ్డు ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపి తక్షణ రక్షణ చర్యలు చేపట్టిన మంత్రి మేకపాటి*


*సూళ్లూరుపేట నియోజకవర్గంలోని దొరవారిసత్రం మండలం ప్రచారానికి వెళుతూ..రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో దగ్గరుండి మంత్రి మేకపాటి సహాయక చర్యలు*


*రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి  చెన్నైకి చెందిన ద్విచక్ర వాహనదారు*


*గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని మంత్రి ఆదేశం*


*గాయపడిన వ్యక్తిని ఆర్ఎస్ఐ చంద్రమౌళి ద్వారా ఆస్పత్రి తరలించేందుకు ఏర్పాట్లు చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి*


Comments